నేరుగా ఓటీటీకి టాలీవుడ్ సైకలాజికల్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Sumanth Aham Reboot Movie Direct Release On This OTT Platform | Sakshi
Sakshi News home page

Sumanth latest Movie: డైరెక్ట్‌గా ఓటీటీకి సుమంత్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published Fri, Jun 28 2024 4:18 PM | Last Updated on Fri, Jun 28 2024 4:23 PM

Tollywood Hero Sumanth latest Movie Released In Ott On This Date

టాలీవుడ్ హీరో సుమంత్ నటిస్తోన్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ  అహం రీబూట్‌. ఈ సినిమాకు ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సినిమాను రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది.

అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మొదట థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది.   సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement