
సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరొద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంశీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే సమయంలో మహేశ్‌తో ప్రేమలో పడిపోయింది. అంజీ మూవీ తర్వాత మహేశ్‌ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, బిజినెస్ వ్యవహరాలతో బిజీగా ఉంది. ఇక మహేశ్ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటే.. భర్తకు సంబంధించిన వ్యాపారాలు, జీఎమ్‌బీ ప్రొడక్షన్స్ వ్యవహరాలతో పాటు పిల్లల బాధ్యతలను నమ్రత చూసుకుంటుంది.
చదవండి: గ్రాండ్‌గా నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్
అయితే ఆమె సినిమాల్లో నటించకపోయిన అప్పుడప్పుడు భర్త మహేశ్‌తో కలిసి ప్రకటనలో నటించడం, మ్యాగజైన్స్ కోసం ఫొటోషూట్స్ ఇవ్వడం చేస్తూనే ఉంటుంది. దీంతో ఆమె మళ్లీ తను నటించే అవకాశం ఉందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో తన రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది నమ్రత. ఇటీవల తన స్నేహితులు ప్రారంభించి స్టైలింగ్ స్టోర్ ప్రారంభోత్సవానికి నమ్రత ముఖ్య అతిథిగా హజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. మహేశ్‌కు షాపింగ్ అంటే అసలు నచ్చదని, ఆయన కోసం కూడా తానే షాపింగ్ చేస్తానని చెప్పింది.
చదవండి: నయన్‌పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్
ఆ తర్వాత సినిమాల్లోకి తన రీఎంట్రీపై స్పందిస్తూ.. ‘తిరిగి నేను సినిమాల్లో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వారందరిని ఎప్పుడు హర్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలను చూసుకోవడం బిజీగా ఉన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. నిజానికి మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా నాకు లేదు. అందుకే నటించాలనే ఆలోచనే చేయడం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు’ అంటూ నమ్రత క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇక నమ్రతను తెరపై చూసే అవకాశం లేదా? అని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment