అలనాటి స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి | Actress Laila Re Entry With Tamil Movie Sardar After 16 Years | Sakshi
Sakshi News home page

Actress Lila: రీఎంట్రీ ఇస్తున్న అలనాటి తార, హీరోయిన్‌ లైలా

Published Tue, Mar 29 2022 4:14 PM | Last Updated on Tue, Mar 29 2022 4:48 PM

Actress Laila Re Entry With Tamil Movie Sardar After 16 Years - Sakshi

Laila Returns To Movies After 16 Years: ‘ఎగిరే పావురమా..’ మూవీతో టాలీవుడ్‌ వెండితెరపై మెరిసిన అలనాటి తార, సొట్టబుగ్గల బ్యూటీ లైలా రీఎంట్రీ ఇవ్వబోతోంది. వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె దాదాపు 16ఏళ్ల తర్వాత కోలీవుడ్‌ రీఎంట్రీ ఇస్తోంది. హీరో కార్తీ తాజా చిత్రం సర్ధార్‌ మూవీలో లైలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొందని, ఆమెకు సంబంధించిన 15 రోజుల షూటింగ్‌ షెడ్యుల్‌ కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో లైలా పాత్ర కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ‘దుష్మన్‌ దునియా కా’ అనే హిందీ మూవీతో మొదట సినీరంగ ప్రవేశం ఇచ్చిన లైలా ఎగిరేపావురంతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

చదవండి: సౌత్‌ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్‌ కామెంట్స్‌

ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు తక్కువే అయిన తన క్యూట్‌ స్మైల్‌తో కుర్రకారు మనసులను దొచుకుంది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘పెళ్లి చేసుకుందాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన లైలా చివరిగా ‘నువ్వే కావాలి’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో మెప్పించింది. తెలుగులో నటిస్తూనే తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలో లైలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని నటకు బ్రేక్‌ ఇచ్చి ముంబై వెళ్లిపోయిన లైలా వెండితెరపై కనిపించి 16 ఏళ్లు గడిచిపోయింది.

చదవండి: రాధేశ్యామ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

ఈ నేపథ్యంలో హీరో కార్తీ సినిమాతో లైలా కోలీవుడ రీఎంట్రీ ఇస్తుండంతో ఆమె ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్‌కి కూడా ఆమె త్వరలోనే రీఎంట్రీ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కాగా లైలా తమిళంలో చివరిగా అజిత్‌ హీరోగా 2006లో వచ్చిన ‘తిరుపతి’ సినిమాలో కనిపించింది. సర్ధార్‌ మూవీలో మొదట లైలా పాత్రకు నటి సిమ్రాన్‌ అనుకున్నారట. ఆమె వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉండటంతో తన స్థానంలో లైలాను పరిశీలించి సంప్రదించారట దర్శక-నిర్మాతలు. కథ నచ్చడంతో లైలా వెంటనే గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చిందని సమాచారం. కాగా ఈ సినిమాలో కార్తీకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి పీఎస్‌ మిత్రాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement