మార్చికల్లా భారత్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్‌ | Nokia Android Phones Tipped to Get a Personal Assistant Named 'Viki' | Sakshi
Sakshi News home page

మార్చికల్లా భారత్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్‌

Published Tue, Jan 10 2017 1:08 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

మార్చికల్లా భారత్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్‌ - Sakshi

మార్చికల్లా భారత్‌లో నోకియా స్మార్ట్‌ఫోన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం నోకియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో రీ–ఎంట్రీ ఇచ్చింది. నోకియా–6 పేరుతో కంపెనీ తొలి ఆన్‌డ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌  చైనాలో ఆవిష్కరించింది. ధర రూ.16,739 ఉంది. భారత్‌లో మార్చికల్లా అడుగు పెట్టనుందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు.2.5డీ గొరిల్లా గ్లాస్‌తో 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, డ్యూయల్‌ సిమ్‌ పొందుపరిచారు.

ఎండ వెలుతురులోనూ స్క్రీన్‌ను చక్కగా చూడొచ్చు. మెటల్‌ బాడీతో రూపొం దించారు. ఆన్‌డ్రాయిడ్‌ నౌగట్‌ ఓఎస్,  క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ప్రాసెసర్, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్, ఫేస్‌ డిటెక్షన్‌ ఆటో ఫోకస్‌ డ్యూయల్‌ టోన్‌ ఫ్లాష్‌తో 16 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా,డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీ డ్యూయల్‌ యాంప్లిఫయర్స్, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది. మైక్రోసాఫ్ట్‌ నుంచి నోకియా బ్రాండ్‌ లైసెన్సింగ్‌ హక్కులను ఫిన్లాండ్‌కు చెందిన హెచ్‌ఎండీ గ్లోబల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నోకియా ఫోన్లనుఫాక్స్‌కాన్‌ తయారు చేయనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement