Is Kajal Aggarwal Is Ready For Re Entry In Movies Soon, Deets Inside - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal Re Entry: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్‌ అగర్వాల్‌!

Published Tue, Jun 7 2022 3:33 PM | Last Updated on Tue, Jun 7 2022 5:04 PM

Is Kajal Aggarwal Ready To Re Entry In Movies Soon - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తనయుడికి నీల్‌ కిచ్లూ అని ఇప్పటికే పేరు కూడా పెట్టేసింది. ఇక చిన్నారి రాకతో కాజల్‌ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో కాజల్‌ సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని వినికిడి.

చదవండి: ఈవారం సినిమా జాతర.. ఏకంగా 22 చిత్రాలు, సిరీస్​లు

కాగా ప్రెగ్నెన్సీ సమయంలో ‘ఆచార్య’ మూవీతో పాటు అప్పటికే సైన్‌ చేసిన పలు ప్రాజెక్ట్స్‌ నుంచి కూడా ఆమె తప్పుకుంది. దీంతో కాజల్‌ పూర్తి కుటుంబంతో దృష్టి పెట్టాలనుకుంటోందని, అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై కాజల్‌ కూడా స్పందించకపోవడంతో అంతా నిజమే అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో బోద్దుగా తయారైన కాజల్‌ బిడ్డ పుట్టిన అనంతరం నాజుగ్గా తయారవుతోంది.

చదవండి: దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్​ రెహమాన్​ను ఏమార్చలేం: డైరెక్టర్​

కొడుకు నీల్‌ కిచ్లు పుట్టిన అనంతరం ఆమె తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇందులో కాజల్‌ రోజురోజుకు కాస్తా నాజుగ్గా, గ్లామరస్‌గా కనిస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకే తను శరీరాకృతిపై ఫోకస్‌ పెడుతుందని, వీలైనంత త్వరగా బరువు తగ్గి సినిమాలు చేయాలని భావిస్తోందని సన్నిహితుల నుంచి సమాచారం. అంతేకాదు ఇప్పటికే కాజల్ మేనేజర్, ఏజెంట్స్ ఆమె రీఎంట్రీకి తగిన కథ కోసం చూస్తున్నారట. మరి ఆమె మళ్లీ సినిమాల్లోకి వచ్చి అభిమానులను ఎంతమేర అలరిస్తుందో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement