న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హోమ్‌కేర్ సొల్యూషన్స్ సంస్థ బిస్సెల్ ఆరేళ్ల తర్వాత భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. ఈసారి భారత్‌లో ఉత్పత్తుల పంపిణీ కోసం కావిటాక్ గ్లోబల్ కామర్స్ సంస్థతో జట్టు కట్టింది.
స్పాట్‌క్లీన్ హైడ్రోస్టీమ్, స్పాట్‌క్లీన్ ప్రోహీట్ పేరిట పోర్టబుల్ వెట్, డ్రై వేక్యూమ్ క్లీనింగ్ సిస్టమ్‌ల విక్రయాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు బిసెల్ ప్రెసిడెంట్ (గ్లోబల్ మార్కెట్స్) మ్యాక్స్ బిసెల్ తెలిపారు. ప్రస్తుతం ఫ్లోర్ సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించి భారత్‌లో మార్కెట్ పరిమాణం చిన్నగానే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ముందుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి భాగస్వాములతో ఆన్‌లైన్‌లో అమ్మకాలతో పారంభించి, విక్రయాల పరిమాణాన్ని బట్టి క్రమంగా ఆఫ్‌లైన్‌లో కూడా కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉందని మ్యాక్స్ వివరించారు. అమెరికా, చైనా తదితర దేశాల్లో గణనీయంగా వ్యాపారం ఉన్న బిసెల్ సంస్థ 2018లో దేశీ మార్కెట్ కోసం యూరేకా ఫోర్బ్స్‌తో జట్టు కట్టింది. కానీ, ఆ తర్వాత భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment