Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai - Sakshi
Sakshi News home page

Aditi Shankar: డైరెక్టర్‌ శంకర్‌ కూతురు హీరోయిన్‌గా మరో చిత్రం..

Published Sat, Aug 6 2022 8:48 AM | Last Updated on Sat, Aug 6 2022 10:24 AM

Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai - Sakshi

Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai: వరుసగా హిట్‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు కోలీవుడ్‌ హీరో శివ కార్తికేయన్‌. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'మావీరన్‌'. తెలుగులో 'మహవీరుడు'గా రాబోతుంది. తమిళ చిత్రం 'మండేలా' చిత్రానికి దర్శకత్వం వహించిన మడోనా అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్‌ శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అదితి ఇదివరకే కార్తీ హీరోగా నటించిన 'విరుమన్‌' చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. 

ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం (ఆగస్టు 5) చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగిబాబు, సరిత, దర్శకుడు మిస్కిన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భరత్‌ శంకర్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్‌ నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్‌) చిత్రం ‘ప్రిన్స్‌’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement