![Director Shankar Condition to Aditi Shankar - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/9/aditi-shankar-02.jpg.webp?itok=vmvZGw_Y)
హీరోయిన్ అదితి శంకర్.. స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా సినీ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇప్పటికి కథానాయికగా చేసింది రెండు చిత్రాలే అయినా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసిన అదితి శంకర్ తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళి హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నటిస్తోంది. సేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇందులో విష్ణు విశాల్‌తో జత కట్టనుంది. కాగా ఎంబీబీఎస్ చదివిన అదితి శంకర్‌కు డాక్టర్ కావాలన్నది ఆమె తల్లిదండ్రుల ఆకాంక్ష అని తెలుస్తోంది. చాలా చలాకీగా ఉండే అదితి శంకర్‌కు సినిమాలపై ఆసక్తి ఏర్పడడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిందని సమాచారం.
అయితే అదితి శంకర్ నటించడానికి అంగీకరించిన ఆమె తండ్రి శంకర్ ఓ కండిషన్ పెట్టారట. రెండేళ్ల వరకూ నువ్వు ఎన్ని చిత్రాల్లో అయినా నటించు.. ఆ తరువాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తేల్చిచెప్పారట. అందుకనే ఈ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలని అదితి తహతహలాడుతోందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే డైరెక్టర్ శంకర్ ఇలాంటి కండీషన్ పెట్టాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. బహుశా ఇది వుట్టి పుకారు మాత్రమే అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. లేదంటే తన ప్రతిభను చూశాకైనా శంకర్ ఈ కండీషన్ ఉపసంహరించుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
చదవండి: కోర్టు గొడవల్లో భోళా శంకర్
Comments
Please login to add a commentAdd a comment