పెళ్లై అత్తవారింటికి వెళ్లే వరకు కూతుళ్లకు తమ రక్షణ అవసరమని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఇలానే భావించారన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్. ఈమెకు సినిమా హీరోయిన్ కావాలన్నది చిరకాల వాంఛ. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు.
ఇది ఆమె తండ్రి దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్‌నే విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు. అయితే హీరోయిన్‌గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్ అంగీకరించాట. అయితే ఆయనకు అసలు టెన్షన్ ఆ తరువాతే మొదలైందట. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్ తర్వాత శింబు కథానాయకుడుగా నటించే కరోనా కుమార్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట.
ఇది దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం నటుడు శింబుపై ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా ముద్ర పడడమే అట. ఈ నేపథ్యంలో కరోనా కుమార్ చిత్రం అనేక సమస్యల కారణంగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్ టెన్షన్ పోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment