Aditi Shankar Upcoming Movie With Director Vishnu Vardhan - Sakshi
Sakshi News home page

Aditi Shankar: పోర్చుగల్‌లో అదితి శంకర్‌ హల్‌చల్‌!

Published Tue, Jul 25 2023 10:29 AM | Last Updated on Tue, Jul 25 2023 10:57 AM

Aditi Shankar Upcoming Movie Update - Sakshi

దర్శకుడు శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ కథానాయికగా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే కార్తీ, శివకార్తీకేయన్‌కు జంటగా నటించారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందాయి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతిథి శంకర్‌ తన ఫొటోలను తరచూ పోస్ట్‌ చేస్తూ ఇటు చిత్ర పరిశ్రమల దృష్టిని తనవైపు పడేలా చూసుకుంటూ, అటు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాగా ఇటీవల విధులైన మావీరన్‌ చిత్రంలో కథానాయికగా అదితి శంకర్‌ మంచి పాత్ర పోషించారు.

తాజాగా ఈమె తన మూడో చిత్రానికి సిద్ధమయ్యారు నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్‌ మురళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో అదితి శంకర్‌ నాయకిగా నటిస్తున్నారు. దీనికి విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్స్‌ బీ ఫిలిమ్‌ క్రియేటర్స్‌ పతాకంపై సేవియర్‌ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను చైన్నెలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లిస్బన్‌లో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనటానికి నటి అది శంకర్‌ సోమవారం పోర్చుగల్‌ దేశానికి బయలుదేరారు. అక్కడ వచ్చే నెల చివరి వరకు షూటింగ్‌ జరుగుతుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement