లక్కీ హీరోయిన్‌ రెమ్యునరేషన్‌ ఇంత తక్కువా..? | Actress Aditi Shankar Remuneration For One Movie, Interesting Deets Inside - Sakshi

Aditi Shankar Remuneration: లక్కీ హీరోయిన్‌ రెమ్యునరేషన్‌ ఇంత తక్కువా..?

Mar 24 2024 6:50 AM | Updated on Mar 24 2024 11:39 AM

Aditi Shankar Remuneration For One Movie - Sakshi

ఏ రంగంలోనైనా విజయాల ప్రభావం చాలానే ఉంటుంది. అందుకు ప్రతిభ, శ్రమ మాత్రమే సరిపోదని, అదృష్టం తోడవ్వాలన్నది వాస్తవం. ఒక్కోసారి హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు విజయం సాధించినా, తదుపరి అవకాశాలు రావడం కష్టంగా మారుతుంది. అయితే నటి అదితి శంకర్‌ పరిస్థితి ఇందుకు విరుద్ధం అనే చెప్పాలి. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇద్దరు కూతుళ్లలో చిన్న కూతురు అదితి శంకర్‌. వైద్య విద్యను అభ్యసించిన ఈ భామ నటనపై ఆసక్తితో సినీ రంగప్రవేశం చేశారు. అలా 2022లో కార్తీకి జంటగా విరుమాన్‌ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంతో గాయనిగానూ పరిచయం కావడం విశేషం.

ఈ చిత్రంలో ఆమె పాడిన పాట హిట్‌ కావడంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈమె నటించిన రెండో చిత్రం మావీరన్‌. శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. దీంతో కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌ అనే ముద్ర వేసుకున్నారు. కాగా ప్రస్తుతం విష్ణువర్థన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దివంగత నటుడు మురళీ రెండో కొడుకు, నటుడు అధర్వ తమ్ముడు ఆకాశ్‌ మురళీ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.

కాగా ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు సూర్య సరసన జత కట్టే అవకాశం అదితి శంకర్‌ను వరించిందన్న టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నటుడు సూర్య నిర్మించనున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే నటుడు అధర్వ సరసన కూడా అదితి శంకర్‌ నటించనున్నారనేది తాజా సమాచారం. ఇలా రెండేళ్లలో ఈమె నటించిన రెండు చిత్రాలు విడుదలై సక్సెస్‌ కాగా, మరో మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం విశేషం.

ఇకపోతే అదితి శంకర్‌ పారితోషికం విషయానికి వస్తే ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.25 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు విజయం సాధిస్తే ఈ అమ్మడి పారితోషికం కోటికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వర్గం టాక్‌. అంతా లక్కు ప్రభావం. కాగా అదితి శంకర్‌ ఇప్పటికే రూ.80 లక్షల వరకూ కూడబెట్టినట్లు సమాచారం. ఇకపోతే ఈమె తండ్రి దర్శకుడు శంకర్‌ ఆస్తి రూ.250 కోట్లకు పైనేనట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement