డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ 2.0. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని రజనీకాంత్ అక్కడి నుంచి నేరుగా ఇంటికెళ్లిపోయారని సమాచారం. రజనీకి గాయమైందన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆయన గత చిత్రం కబాలి విడుదలకు ముందు కూడా ఆయన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే.