RC15: Ram Charan, Kiara Advani and Shankar wrap up New Zealand Schedule - Sakshi
Sakshi News home page

RC15 : న్యూజిలాండ్‌లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన రామ్‌చరణ్‌, కియారా

Published Thu, Dec 1 2022 8:50 AM | Last Updated on Thu, Dec 1 2022 11:29 AM

Ram Charan And Kiara Advani Wrap New Zealand Schedule For RC15 Film - Sakshi

న్యూజిలాండ్‌కి బై బై చెప్పారు రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, కియారాలపై బాస్కో వర్టిస్‌ కొరియోగ్రఫీలో ఓ సాంగ్‌ చిత్రీకరణ పూర్తి చేశారు.

‘న్యూజిలాండ్‌లో సాంగ్‌ షూటింగ్‌ పూర్తయింది. అద్భుతమైన విజువల్స్‌ వచ్చాయి’’ అని బుధవారం ట్వీట్‌ చేశారు రామ్‌చరణ్‌. కాగా ఈ పాట చిత్రీకరణకు దాదాపు రూ.15కోట్లు ఖర్చుచేశారట చిత్రయూనిట్‌. సో.. ఈ సాంగ్‌ ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌గా ఉండనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement