Director Shankar Spend Rs 10 Crore For Only Fight Scene: డైరెక్టర్ శంకర్ సినిమాలు అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినిమాలను హాలీవుడ్ రేంజ్‌లో నిలబెట్టిన ఘనత ఆయనది. ఆయన సినిమాలో వావ్ అనిపించే ఎన్నో వింతలు కనిపిస్తాయి. అత్యాధునిక విజువల్ వండర్స్‌తో సినిమాలను తెరకెక్కించే ఇండియన్ ఏకైక డైరెక్టర్ ఆయన. అందుకే శంకర్ సినిమా అనగానే ఆయన ఏలాంటి వండర్ క్రియేట్ చేయబోతున్నారా? అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతలా గుర్తింపు పొందిన ఆయన.. సినిమాలను తెరకెక్కించే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న యంగ్ క్రికెటర్!
RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా కొంతభాగం షూటింగ్‌ను జరుపుకోగా అందులో ఓ భారీ ఫైట్ సీన్, ఓ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఒక్క ఫైట్ సీన్ కోసం శంకర్ రూ. 10 కోట్లు ఖర్చు చేయించారట. అంతేకాదు పాటకు కూడా రూ. 10కోట్లు ఖర్చు చేశారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఓ పాట, ఫైట్ సీన్‌కే శంకర్ రూ.20 కోట్లు ఖర్చు చేస్తే ఇక సినిమా అయిపోయేసరికి ఎంత ఖర్చు పెట్టిస్తారో అని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు కూడా శంకర్ భారీగా ఖర్చు పెట్టించినట్లు అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
చదవండి: అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ పర్‌ఫెక్ట్ యాప్ట్: ఓం రౌత్
హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వాని, మిగతా నటీనటులుచ, నిర్మాత దిల్ రాజు, శంకర్‌లు సూటు ధరించి ఆఫీసర్స్ లుక్‌లో ఉన్న ఆ పోస్టర్‌కు దాదాపు కోటీన్నరకు పైగా ఖర్చయినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇదే జోషల్ ఆచార్య మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చరణ్ పాల్గొననున్నాడట. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను కొరటాల శివ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత చరణ్ తిరిగి RC15 షూటింగ్‌లో పాల్గొన్ననున్నాడని సమాచారం. కాగా ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment