కడపలో తమిళనాడు! | Shankar, Varman locations search for Indian 2 | Sakshi
Sakshi News home page

కడపలో తమిళనాడు!

Published Tue, Aug 28 2018 12:58 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

Shankar, Varman locations search for Indian 2 - Sakshi

రవి వర్మన్‌, శంకర్‌

ఏంటి బాస్‌.. కడపలో తమిళనాడు ఏంటి? ఏదో రాయాలనుకుని ఏదో రాసేసినట్లున్నారే? అని కన్‌ఫ్యూజ్‌ అవ్వొద్దు. సినిమా అంటే సృష్టించడమే కదా. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ కడపలో తమిళనాడుని తలపించే సెట్‌ వేయాలనుకుంటున్నారట. రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన ‘2.0’ నవంబర్‌ 28న విడుదల కానుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ చకచకా జరుగుతున్నాయి.

దాంతో ‘ఇండియన్‌’కి సీక్వెల్‌గా తీయాలనుకుంటున్న ‘ఇండియన్‌2’ సినిమాపై శంకర్‌ దృష్టి పెట్టారు. ఛాయాగ్రాహకుడు రవి వర్మన్‌తో కలసి హెలికాప్టర్‌లో కడపలో వాలిపోయారు. సినిమాకి అనువైన లొకేషన్స్‌ వెతుకుతున్నారు. తమిళనాడుని తలపించే సెట్‌ కూడా కడపలో వెయ్యాలనుకుంటున్నారట. ఇదే సినిమా కోసం థాయ్‌ల్యాండ్‌లో లొకేషన్స్‌ వెతికారు ఈ ఇద్దరూ. ఇప్పుడు కడప. నెక్ట్స్‌ ఎక్కడో? ఫస్ట్‌ పార్ట్‌లో నటించిన కమల్‌హాసన్‌ సెకండ్‌ పార్ట్‌లోనూ హీరోగా నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement