ravi varman
-
కడపలో తమిళనాడు!
ఏంటి బాస్.. కడపలో తమిళనాడు ఏంటి? ఏదో రాయాలనుకుని ఏదో రాసేసినట్లున్నారే? అని కన్ఫ్యూజ్ అవ్వొద్దు. సినిమా అంటే సృష్టించడమే కదా. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కడపలో తమిళనాడుని తలపించే సెట్ వేయాలనుకుంటున్నారట. రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘2.0’ నవంబర్ 28న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. దాంతో ‘ఇండియన్’కి సీక్వెల్‌గా తీయాలనుకుంటున్న ‘ఇండియన్2’ సినిమాపై శంకర్ దృష్టి పెట్టారు. ఛాయాగ్రాహకుడు రవి వర్మన్‌తో కలసి హెలికాప్టర్లో కడపలో వాలిపోయారు. సినిమాకి అనువైన లొకేషన్స్ వెతుకుతున్నారు. తమిళనాడుని తలపించే సెట్ కూడా కడపలో వెయ్యాలనుకుంటున్నారట. ఇదే సినిమా కోసం థాయ్‌ల్యాండ్‌లో లొకేషన్స్ వెతికారు ఈ ఇద్దరూ. ఇప్పుడు కడప. నెక్ట్స్ ఎక్కడో? ఫస్ట్ పార్ట్‌లో నటించిన కమల్‌హాసన్ సెకండ్ పార్ట్‌లోనూ హీరోగా నటించనున్నారు. -
సై రా అప్ డేట్ : రవివర్మన్ అవుట్
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సై రా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు ప్రధాన పాత్రదారులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ప్రకటించేశారు. అయితే కొద్ది రోజులు ఈ సినిమా టెక్నిషియన్స్ ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగా సంగీత దర్శకుడు రెహమాన్ సై రా నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా సై రా నుంచి తప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి రవివర్మన్ స్థానంలో రత్నవేలును తీసుకున్నారన్న ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కబోయే భారతీయుడు 2 కోసమే రవివర్మన్.. సై రా నుంచి తప్పుకున్నారట. రత్నవేలు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్నరంగస్థలం 1985 సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అయితే సైరా నరసింహారెడ్డి విషయంలో సినిమాటోగ్రాఫర్ మార్పు నిజమా కాదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే. -
'సై రా'పై రోజుకో వార్త..!
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సై రా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు ప్రధాన పాత్రదారులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ప్రకటించేశారు. అయితే కొద్ది రోజులు ఈ సినిమా టెక్నిషియన్స్ ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగా సంగీత దర్శకుడు రెహమాన్ సై రా నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా సై రా నుంచి తప్పుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో బర్ఫీ, రామ్ లీలా, జగ్గా జాసూస్ లాంటి విభిన్న చిత్రాలకు పని చేసిన రవి వర్మన్ సినిమాటోగ్రఫి సై రాకు అదనపు ఆకర్షణ అవుతుందని భావించారు. మరి ఫిలిం నగర్ టాక్ ప్రకారం నిజంగానే రవి వర్మన్, రెహమాన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా.. లేదా అన్న విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమా?
‘గీతాంజలి’... విడుదలై పాతికేళ్లవుతోంది. ఇంకా ఎవరూ మరచిపోలేదు. మరచిపోలేరు కూడా. నాటి యువతరాన్నే కాదు, నేటి యువతను కూడా వెంటాడుతోన్న అజరామర ప్రేమకావ్యం అది. తెలుగులో ఈ ఒక్క సినిమానే చేశారు మణిరత్నం. దాన్ని క్లాసిక్‌గా నిలబెట్టారు. మణిరత్నం డెరైక్ట్ తెలుగు సినిమా మళ్లీ ఎప్పుడు తీస్తారు? అని పాతికేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. త్వరలోనే డెరైక్ట్ తెలుగు సినిమా మణిరత్నం చేయబోతున్నారట. తెలుగు, తమిళ భాషల్లో మణిరత్నం ఓ చిత్రం తెరకెక్కించనున్నట్లు, తెలుగు వెర్షన్లో నాగార్జున, మహేశ్ హీరోలుగా నటించనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే... తాజా సమాచారం ఏంటంటే... మణిరత్నం డెరైక్ట్‌గా ముందు తెలుగులోనే సినిమా చేస్తారట. ఆ తర్వాతే తమిళ సినిమా ఉంటుందట. హైదరాబాద్‌లోని పలు అందమైన లొకేషన్లను కూడా ఈ సినిమా కోసం మణిరత్నం ఖరారు చేశారట. నాగార్జున, మహేశ్ ఇందులో హీరోలుగా చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూలైలో మొదలవుతుందని వినికిడి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఐశ్వర్యారాయ్ ఇందులో ముఖ్యపాత్ర చేయబోతున్నారట. రవివర్మన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్నట్లు తెలిసింది.