'సై రా'పై రోజుకో వార్త..! | Ravi Varman, Ar Rahman has backed out of the sye raa | Sakshi
Sakshi News home page

'సై రా'పై రోజుకో వార్త..!

Published Wed, Oct 4 2017 10:55 AM | Last Updated on Wed, Oct 4 2017 12:09 PM

Sye raa narasimha reddy

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సై రా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు ప్రధాన పాత్రదారులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ప్రకటించేశారు. అయితే కొద్ది రోజులు ఈ సినిమా టెక్నిషియన్స్ ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగా సంగీత దర్శకుడు రెహమాన్ సై రా నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా సై రా నుంచి తప్పుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ లో బర్ఫీ, రామ్ లీలా, జగ్గా జాసూస్ లాంటి విభిన్న చిత్రాలకు పని చేసిన రవి వర్మన్ సినిమాటోగ్రఫి సై రాకు అదనపు ఆకర్షణ అవుతుందని భావించారు. మరి ఫిలిం నగర్ టాక్ ప్రకారం నిజంగానే రవి వర్మన్, రెహమాన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా.. లేదా అన్న విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement