సాక్షి, న్యూఢిల్లీ : సైరా నరసింహారెడ్డి చ్రితం చాలా బాగుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. బుధవారం తన నివాసంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెంకయ్య, ఆయన కుటుంబసభ్యులు సైరా చిత్రాన్ని వీక్షించారు. అనంతరం వెంకయ్య సైరా చిత్రంపై తన స్పందన తెలియజేశారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం చాలా గొప్ప నిర్ణయం. భారతదేశం స్వరూపాన్ని, వలస పాలకుల నియంతృత్వ పాలన గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా వల్ల ప్రజల్లో దేశం మీద ప్రేమ మరింత పెరుగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి నటన చాలా బాగుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా చాలా బాగా నటించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మేమిద్దరం(చిరంజీవి, నేను) ఇప్పుడు రాజకీయాలను వదిలేశాం. మరిన్ని సినిమాలతో చిరంజీవి ప్రజలను రంజింప చేయాల’ని వెంకయ్య పేర్కొన్నారు. అలాగే చిత్ర నిర్మాత రామ్‌చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి అభినందలు తెలిపారు.
ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగాను : చిరంజీవి
వెంకయ్య నాయుడు సమయం తీసుకుని ‘సైరా’ చూడటం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెంకయ్య రాజకీయాల్లో ఎదిగారని గుర్తుచేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ అడిగానని తెలిపారు. ఈ రోజు వెంకయ్యను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి సైరా చిత్రం చూడాల్సిందిగా ఆహ్వానించారు. వెంకయ్య నివాసంలోనే సైరా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment