
శంకర్, కమల్‌హాసన్
లంచం కోసం పీడించేవాడు సొంత కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే అనే కాన్పెప్ట్‌తో ఆల్మోస్ట్ 22ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశారు దర్శకుడు శంకర్. ఫస్ట్ పార్ట్‌లో హీరోగా నటించిన కమల్‌హాసన్‌నే ఈ సీక్వెల్‌లోనూ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అప్‌డేట్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా దర్శకుడు శంకర్ తెలియజేశారు.
‘ఇండియన్ 2’ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నట్లు ‘హీలియమ్ బెలూన్’ను ఆయన తైవాన్‌లో ఎగురవేశారు. ఆ బెలూన్‌పై ‘ఇందియన్ 2’ అని తమిళంలో ‘ఇండియన్ 2’ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంది. ఇలా రెండో భారతీయుడు తైవాన్‌లో స్టార్ట్ అయ్యాడన్నమాట. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘2.0’కి ఓ రచయితగా వ్యవహరించిన జయమోహన్ ‘భారతీయుడు 2’కి కూడా రైటర్‌గా చేయనున్నారట. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment