న్యూలుక్ కోసం.. | Rajinikanth new look | Sakshi
Sakshi News home page

న్యూలుక్ కోసం..

Jun 17 2016 1:03 AM | Updated on Sep 4 2017 2:38 AM

న్యూలుక్ కోసం..

న్యూలుక్ కోసం..

2.ఓ చిత్రం కోసం మన సూపర్‌స్టార్ న్యూలుక్‌తో సిద్ధమయ్యారు.

2.ఓ చిత్రం కోసం మన సూపర్‌స్టార్ న్యూలుక్‌తో సిద్ధమయ్యారు. ఇది ఆయన అభిమానులకు పండగ చేసుకునే విషయమే. సూపర్‌హిట్ చిత్రం ఎందిరన్ కాంబినేషన్ రజనీకాంత్, శంకర్ మరోసారి కలిసి చేస్తున్న బ్రహ్మాండ చిత్రం 2.ఓ.బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్ల భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్న విషయం విదితమే.


2.ఓ చిత్రాన్ని స్వదేశీ ప్రముఖ కళాకారులతో పాటు ప్రఖ్యాత హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో దర్శకుడు శంకర్ అద్భుతంగా సెల్యులాయిడ్‌పైకి ఎక్కిస్తున్నారు.  చిత్రాన్ని వచ్చే ఎడాది తమిళ ఉగాదికి విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  రజనీకాంత్ కొత్త లుక్‌లో కనిపించి కనువిందు చేయనున్నారు. అలాంటి గెటప్ కోసం ప్రస్తుతం ఆయన అమెరికాలో హాలీవుడ్ మేకప్ నిపుణుల పర్యవేక్షణలో టెస్ట్‌ల్లో పాల్గొంటున్నారు.
 

వదంతులు:  కొద్ది రోజులుగా రజనీకాంత్ మళ్లీ అనారోగ్యానికి గురైయ్యారని, అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారనే వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి.కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు విహార యాత్రకు వెళ్లిన రజనీకాంత్ పనిలో పనిగా 2.ఓ చిత్రంలో గెటప్ కోసం మేకప్ టెస్ట్‌ల్లో పాల్గొంటున్నారు. ఎప్పుడు విహార యాత్రకు వెళ్ళినా వారంలోపు తిరిగొచ్చే రజనీకాంత్ రెండు వారాలు దాటినా చెన్నైకి రాకపోవడం, ఆయన నటించిన మరో చిత్రం కబాలి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా రాకపోవడంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వదంతులు ప్రచారం అవుతున్నాయి.అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రజనీ కుటుంబ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.అందులో రజనీకాంత్ క్షేమంగా ఉన్నారనీ,ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదనీ పేర్కొన్నారు.ఆయన త్వరలోనే చెన్నైకి తిరిగి రానున్నారని తెలిపారు. వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంలూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement