
శిరీష, ఎన్.ఆర్. రెడ్డి
‘‘ఉన్మాది’ లాంటి సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎన్.ఆర్. రెడ్డిగారు ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. హీరోయిజమ్, విలనిజమ్ చూపించదగిన పాత్రలో ఎన్.ఆర్. రెడ్డిగారు నటించారు. తమిళ్‌లో రాజ్‌కుమార్‌గారు కూడా ఇదే వయసులో హీరోగా పరిచయం అయ్యారు’’ అని డైరెక్టర్ ఎన్.శంకర్ అన్నారు. ఎన్.ఆర్. రెడ్డి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉన్మాది’.
ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో ఎన్. రామారావు నిర్మించారు. డేవిడ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత రాజ్‌కందూరి విడుదల చేయగా, ట్రైలర్‌ను ఎన్.శంకర్ ఆవిష్కరించారు. ‘‘స్వర్గీయ హరికృష్ణగారికి నేను ఫ్యాన్. ఆయనే నాకు స్ఫూర్తి. ‘ఉన్మాది’ సినిమాలో ఒక్కసారైనా ఆయనలా కనిపించాలని ప్రయత్నించాను. రాఘవ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు ఎన్.ఆర్.రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: దంటు వెంకట్, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి.
Comments
Please login to add a commentAdd a comment