![Game Changer: Ram Charan And Director Shankar RC15 Movie Title Revealed On His Birthday - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/ram.jpg.webp?itok=WUoZIed8)
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వాణీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవాళ(సోమవారం)రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ను వదిలారు మేకర్స్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్ చేసేశారు.
ప్రస్తుతం RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గేమ్ ఛేంజర్ అంటూ ఈ పాన్ ఇండియా చిత్రానికి పేరు పెట్టిన మేకర్స్ మరో అప్‌డేట్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా డబుల్ ధమాకాగా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇవాళ మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అభిమానులను మరింత ఖుషీ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
#GAMECHANGER it is…💥💥https://t.co/avGa74S8vH
— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023
Mega Powerstar @alwaysramcharan @shankarshanmugh @advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/2htttRsvPx
Comments
Please login to add a commentAdd a comment