ఎలాంటి కథకైనా లోతైన, పదునైన మాటల్ని రాయడంలో దిట్టగా పేరు సాధించాడు డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన దగ్గరకు చేరుతున్నాయి. తాజాగా ఆయన మరో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడు. రామ్‌చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రానికి సాయిమాధవ్‌ను డైలాగ్ రైటర్‌గా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు సాయిమాధవ్. ‘'జెంటిల్ మేన్' సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు, రామ్‌చరణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు‘ అంటూ ట్వీట్ చేశాడు.
జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు
— Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021
శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి
చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను ..
Thanks to Sankar sir..
Thanks to Dil Rajugaru.. and
Thanks to our
Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG
‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలతో పాటు ‘మహానటి’, ‘ఎన్టీఆర్’ బయోపిక్, ‘సైరా’ తదితర చిత్రాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిమాధవ్ బుర్రా. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’, గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుకు కూడా డైలాగ్స్ అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment