Burra sai madhav
-
ప్రేమమయి సత్యభామ
‘దీపావళి’ సందర్భంగా ‘సత్యభామ’ పాత్ర మనోవిశ్లేషణ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ మాటల్లో... సాక్షికి ప్రత్యేకం.సత్యభామది పరిపూర్ణమైన, మూర్తీభవించిన స్త్రీతత్వం. భారతీయులంతా వారు ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా ఆమెనూ ఆమె పాత్రను ఎవరికివారు తమదిగా భావిస్తారు. మా అమ్మాయే అనుకుంటారు. తెలుగువారు మరో అడుగు ముందుకేసి సత్యభామది తెనాలో ఓరుగల్లో అని భావిస్తారు. సత్యభామ పాత్ర నృత్యరూపాల వల్ల, పౌరాణిక నాటకాల వల్ల, సినిమాల వల్ల మనకు అంత దగ్గర.సత్యభామ మహాతల్లిఅసలు స్త్రీ ఎలా ఉండాలి? నా ప్రపంచానికి నేను అధినేతని అన్నట్లు ఉండాలి. గడప దాటి బయటికి వెళ్లిన భర్తకో ప్రపంచం ఉండొచ్చు... ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా ఉండొచ్చు... కానీ ఒక్కసారి ఇంటి లోపలికి వచ్చాక అతన్ని పరిపాలించడానికి ఒక మనిషి కావాలి... ఆ మనిషిని నేను. మా ఆయన్ని నేను తప్ప ఇంకెవరు పరిపాలిస్తారు అనే భావన సత్యభామది. ఆమె భర్తని కొంగున కట్టేసుకుంది... భర్తని తనకు బానిసలా చేద్దామనుకుందని చాలామంది అనుకుంటారు. అయితే ఇవన్నీ ఆవిడకు తెలియదు. ఆమెకి తెలిసింది ఒక్కటే–అతను నా భర్త... నా సొంతం... నేనేమైనా చేస్తా... అంటే బిడ్డని తల్లి ఎలా చూసుకుంటుంది? తన మాట వినాలనుకుంటుంది కదా... భర్తను అలా చూసుకున్న ఇల్లాలు ఆమె... సత్యభామ మహాతల్లి.అది అహం కాదు... ప్రేమసత్యభామది అహం అని చాలామంది అనుకుంటారు. అసలు ఆవిడ అహం ఎక్కడ చూపించింది? పరిచారిక చెప్పిన మాట కూడా విందామె. తన ఇంట్లో పని చేసే అందరితో స్నేహంగా ఉంది. భర్త మీద ఉన్న అదుపులేని ప్రేమలో అహం, కోపం, కామం, క్రోధం, లోభం... ఇలా అరిషడ్వర్గాలు ఉంటాయి. రామాయణంలో కైక పాత్ర సత్యభామకు దగ్గరగా ఉంటుంది. ఆమె కూడా తన భర్తను గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది. అలాగే సత్యభామలా భర్త కోసం యుద్ధం చేసింది... భర్తను గెలిపించింది. అయితే సత్యభామ నుంచి కైకని విడదీసే అంశం ఏంటంటే స్వార్థం. తన కొడుకు రాజు కావాలనే స్వార్థం కైకలో కనిపిస్తుంది. నా కొడుకుని రాజుని చేయా లంటే పెద్ద భార్య కొడుకు రాముడిని అడవులకు పంపాలనుకున్న స్వార్థం ఆమెది. కానీ సత్యభామలో ఆ కోణం కనిపించదు. రాముణ్ణి అడవులకు పంపితే రేపట్నుంచి తన భర్త దశరథుడు ఎప్పటిలా తనతో ఉంటాడా... ఉండడా... ఇవన్నీ కైక ఆలోచించలేదు. ఇదే సత్యభామ అయితే రేపట్నుంచి నా భర్త నాతో మాట్లాడడనే ఆలోచన వచ్చిందంటే దానికి కారణమయ్యే ఏ పనీ ఆ మహాతల్లి చెయ్యదు. సత్యభామది అంత గొప్ప క్యారెక్టర్. ఆమెకు భర్తే సర్వస్వం. అయినా భర్త తప్పు చేస్తే ఒప్పుకోదు. బెత్తం పట్టుకుని కింద కూర్చోబెడుతుంది. సత్యభామ ప్రతి ఇంట్లో ఉన్న తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణుడిలాంటి భర్త కావాలని ఏ భార్యా కోరుకోకపోవచ్చు... కానీ కృష్ణుడులాంటి కొడుకు కావాలనుకుంటుంది. సో... అలా కృష్ణుణ్ణి తన కొడుకులా చూసుకుంది సత్యభామ. బిడ్డని కొట్టినట్లే కొట్టింది... బిడ్డ దగ్గర అలిగినట్లే అలిగింది. సత్యభామ బయటకు వచ్చి ఉంటే...సత్యభామ నాలుగు గోడల మధ్యనే ఉండిపోయింది. అదే బయటకు వస్తే ప్రపంచాన్ని పరిపాలించి ఉండేది. కృష్ణుణ్ణి నరకాసురుడు పడేస్తే... నా భర్తను కొడతావా అంటూ ఆ నరకాసురుణ్ణి చంపేసింది. అంటే... అక్కడ ఆవిడ కృష్ణుడి కన్నా బలవంతురాలనే కదా అర్థం. కృష్ణుడు ఇంటికి రాకపోతే బాధ.. వస్తే ఆనందం... కృష్ణుడు పక్కన లేకపోతే ఆమెకు నరకమే! ఆవిడ సంతోషం, బాధ ఏ ఎమోషన్ అయినా కృష్ణుడే. అంత గొప్ప ఇల్లాలు. డెబ్భై అయిదు శాతం మంది భార్యలు సత్యభామలానే ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే ప్రపంచం నడుస్తోంది.కిరీటం వద్దు... నువ్వు చాలందికృష్ణుడు తన కిరీటాన్ని సత్యభామకు పెడతానన్నా ఒప్పుకోదు... నాకు నీ కిరీటం ఎందుకు? నాక్కావాల్సింది నువ్వు అంటుంది. సత్యభామలా స్వచ్ఛంగా ప్రేమించే భార్య దక్కినందుకు కృష్ణుడు ఎంతో అదృష్టవంతుడు. కృష్ణుడు ఎలా అయితే ప్రేమకు ప్రతి రూపమో... అలా సత్యభామ కూడా కృష్ణుడి ప్రేమకు ప్రతిరూపమే.నచ్చినట్లుగా బతకాలిఈ తరం అమ్మాయిలు సత్యభామ నుంచి నేర్చుకోవాల్సిన విషయం స్త్రీ సాధికారత. ఆమెలా ధైర్యంగా, స్వేచ్ఛగా బతకాలి. కట్టుబాటు అనేది స్త్రీకి ఎలా ఉందో మగవాడికి కూడా అలానే ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరిని పడితే వాళ్లని రేప్ చేయమనా? ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగ మనా? కాదు. స్వేచ్ఛ వేరు... విచ్చలవిడితనం వేరు. సత్యభామది స్వేచ్ఛ. ఆమెలా హద్దుల్లో ఉండు. ఆ హద్దులను అనుభవించు. నీకంటూ ఓ గీత ఉంది. ఆ గీత లోపల నీ ఇష్టం. – ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్ చౌదరి
‘‘నేను పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేయాలని వీణా రావుని ఎంచుకున్నా. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు, దివంగత జానకి రామ్ (ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. కాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వీణా రావు పేరుని పరిచయం చేశారు వైవీఎస్ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబుగారి బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా మా సినిమా కార్యక్రమం జరుపుకోవడం హ్యాపీ. ఈ మూవీకి కీరవాణిగారు సంగీతం అందించనుండటం నా అదృష్టం. సాయి మాధవ్ బుర్రా మాటలు, చంద్రబోస్‌గారి పాటలు మహాద్భుతంగా ఉండనున్నాయి’’ అన్నారు. ‘‘వైవీఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ వంటి మహామహులతో పనిచేసే అవకాశం ఇచ్చిన గీతగారికి ధన్యవాదాలు’’ అని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పారు. -
వాళ్లిదరికి నేనే రైటర్: బుర్రా సాయి మాధవ్
-
నాకు సినిమా పిచ్చి పట్టడానికి కారణం ఆవిడే
-
నాకు మా ఆవిడంటే చాలా భయం...!
-
ఆయనతో ఫొటో దిగాలనుకున్నా, ఇప్పుడు ఏకంగా: RRR డైలాగ్ రైటర్
ఎలాంటి కథకైనా లోతైన, పదునైన మాటల్ని రాయడంలో దిట్టగా పేరు సాధించాడు డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్. అందుకే పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన దగ్గరకు చేరుతున్నాయి. తాజాగా ఆయన మరో పెద్ద ప్రాజెక్ట్ చేజిక్కించుకున్నాడు. రామ్‌చరణ్ - శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రానికి సాయిమాధవ్‌ను డైలాగ్ రైటర్‌గా ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు సాయిమాధవ్. ‘'జెంటిల్ మేన్' సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను. ఈ అవకాశమిచ్చిన శంకర్, దిల్ రాజు, రామ్‌చరణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు‘ అంటూ ట్వీట్ చేశాడు. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను .. Thanks to Sankar sir.. Thanks to Dil Rajugaru.. and Thanks to our Mega Power Star Charanbabu🙏🙏🙏 pic.twitter.com/iswy0DabmG — Saimadhav Burra (@saimadhav_burra) July 13, 2021 ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలతో పాటు ‘మహానటి’, ‘ఎన్టీఆర్’ బయోపిక్, ‘సైరా’ తదితర చిత్రాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిమాధవ్ బుర్రా. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుకు కూడా డైలాగ్స్ అందిస్తున్నాడు. -
స్క్రీన్ ప్లే 27th April 2018
-
‘ఎందుకమ్మా అలా చేసుకున్నావ్ అని అడగాలని ఉంది’
సమయం లేదు మిత్రమా... శరణమా..? రణమా..?’ ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా అందని నోటి నుంచి వెలువడుతున్న డైలాగ్ ఇది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలోని ఈ డైలాగ్ సాయిమాధవ్ బుర్రా కలం నుంచి వెలువడింది. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ నుంచి ఇటీవలి ‘ఖైదీ నంబర్ 150’ వరకు ఎన్నో విలక్షణ సినిమాలకు ఆయన రాసిన సంభాషణలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ‘మహానటి’ సినిమాకు ఆయనే సంభాషణలు సమకూరుస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మహానటి సావిత్రి జీవిత చరిత్రపై రూపొందుతున్న ఈ సినిమాకు పనిచేయటం గొప్ప అవకాశంగా ఆ మాటల రచయిత భావిస్తున్నారు. తెనాలిలో జరుగుతున్న సురభి నాటకోత్సవాలకు వచ్చిన సాయిమాధవ్ ‘సాక్షి’తో ఆ విశేషాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్ కాస్టింగ్... సావిత్రి జీవిత చరిత్రపై ‘మహానటి’ టైటిల్‌తో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. చాలా మంది కన్నా భిన్నమైన దర్శకుడు. ఆలోచనా విధానం గొప్పగా ఉంది. ఏదో సినిమా తీసేద్దాం... గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకుందాం అనుకునే తొందర ఆయనలో కనపడదు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తోనే ఆ విషయం అర్థమైంది. సావిత్రి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్, విజయా వారి నిర్మాత, రచయిత చక్రపాణిగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. ఎన్టీయార్, ఏఎన్నార్ పాత్రలకు కూడా ఫైనలైతే ఇండస్ట్రీలోనే బిగ్ కాస్టింగ్ అవుతుంది. చాలా ఎక్స్ట్రార్డినరీ సినిమా ఇది. మాటలు రాస్తుంటే కన్నీళ్లొచ్చాయి... సావిత్రి, చక్రపాణి, ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, జమున, భానుమతి...ఇలా ఇండస్ట్రీలో ఒకనాటి ప్రముఖుల పాత్రలకు మాటలు రాసే అవకాశం ‘మహానటి’తో లభించడం నా అదృష్టం. ఆ రోజుల్లోకి వెళ్లిపోవడం, రాయడం... గొప్పగా ఉంది. కొన్ని మాటలు రాస్తుంటే కన్నీళ్లు వచ్చేశాయి నాకు. చాలాసార్లు ఆ కన్నీళ్లు రాసే పేపరుపై పడ్డాయి. చిన్నప్పట్నుంచీ పాత సినిమాలు విపరీతంగా చూసేవాడ్ని, వెండితెరపై ప్రకాశించిన తారామణుల గురించి కథలుగా విన్నవాణ్ణి కావటం ప్లస్సయింది. ఇప్పటికీ ఆ సినిమా టాపిక్ వస్తే చాలు... రాసేటప్పటి నా అనుభూతులన్నీ మనసునిండా పరుచుకుంటున్నాయి. సావిత్రి జీవితం ‘పరిపూర్ణం...!’ జీవితంలో రకరకాల సంఘర్షణలు పడిన మహిళలు, సెలబ్రిటీలున్నారు. సినిమా చరిత్రలో భగవంతుడిచ్చిన ప్రతి ఎమోషన్‌నీ సంపూర్ణంగా అనుభవించిన ఏకైక వ్యక్తి సావిత్రి. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించడం, మోసపోతే పూర్తిగా మోసపోవడం, అసహ్యించుకున్నా, అమాయకంగా నమ్మినా అదేరీతి. అలవిమాలిన కీర్తిప్రతిష్టలు సాధించడం, ఏమీ లేదన్నట్టుగా నేలమీదకు రావడం, చివరకు పూర్తిగా చచ్చిపోవటం...ఆమెకే చెల్లింది. పూర్తిగా చచ్చిపోవటమంటే, ఏమీ లేకుండా సావిత్రిగారు చనిపోయినప్పుడు చూస్తే తెలుస్తుంది. శరీరబరువు కూడా సుమా! పుట్టినప్పుడు ఎంత బరువుందో, పోయేటప్పుడు కాస్త అటూఇటూగా అంతే ఉన్నారామె! జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించటమంటే ఇంత పరిపూర్ణంగానా అనిపిస్తుంది. సావిత్రిని చూడాలనిపించింది.. నటీమణులెందరో ఉన్నారు. సావిత్రి వేరు. చక్కని ముఖవర్చస్సు, భావాలను అలవోకగా చెప్పగలిగిన అందమైన కళ్లు... ఒక నటికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. జీవితంలో విఫలమయ్యారని, వైవాహిక జీవితం దెబ్బతిందని, మద్యానికి బానిసైందనీ... అందరికీ తెలిసినట్టుగా నాకూ అంతవరకే తెలుసు. ఎప్పుడైతే ఆమె చరిత్రలోకి వెళ్లామో? జీవితాన్ని పట్టుకున్నామో? ‘సావిత్రి మరోసారి కనిపిస్తే బాగుండును... ‘అందరిలా ఎందుకు ఉండలేకపోయావు? ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు?’ అని అడగాలనిపించింది. రేపు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికీ కచ్చితంగా అలాగే అనిపిస్తుంది. జెమినీ గణేశన్‌ది టిపికల్ పాత్ర. సావిత్రిని అభిమానించేవారు ఆయన్నో విలన్‌గానే భావిస్తారు. వాస్తవంలోకి వెళితే ఆయనపై కోపం రాదు. అంతగా నమ్మడం ఆమె పొరపాటేమో? అనిపిస్తుంది. విభిన్న సినిమాలకు వైవిధ్యంగా... చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’, ఆయన 150వ సినిమాకు నేనే డైలాగులు రాశాను. తొలి స్వాతంత్య్రయోధుడి చరిత్ర అది. ‘సాహో’ తర్వాత ప్రభాస్‌తో మరో సినిమా ఉంది. ‘జిల్’ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తుంది. ఒక ఫిక్షన్లా, ఏమోషన్ థ్రిల్లర్‌లా అనిపిస్తూ అన్నిరకాల షేడ్స్ కనిపిస్తాయి. మహేష్‌బాబు సోదరి మంజుల తొలిసారిగా దర్శకత్వం చేపడుతున్న ప్రేమకథాచిత్రానికి రాస్తున్నా. సందీప్‌కిషన్ హీరో. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘సాక్ష్యం’ సినిమా కూడా ఉంది. విభిన్న కథాంశాలతో సినిమాలు రావటంతో అంతే వైవిధ్యంగా సంభాషణలు రాసే ప్రయత్నం చేస్తున్నాను. మంచి పేరు తెస్తాయని భావిస్తున్నా. అంతా సాయిబాబా దయ. -
ఇద్దరూ ఇద్దరే
తెనాలి : విశాఖలో పుట్టిన ఓ చిన్న ఆలోచన ఓ మంచి సినిమాకు పురుడు పోసింది. క్లిష్టతరమైన జార్జియా దేశానికి ఆ సినిమా యూనిట్‌ను తీసుకెళ్లింది. షూటింగ్ పూర్తి చేసుకుని ‘కంచె’గా తెలుగు తెరపైకొచ్చింది. ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. జాతీయ జ్యూరీని మెప్పించింది. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం, పల్లెటూరిలో అమలిన ప్రేమకథను మిళితం చేసి రెండు పొరలుగా అల్లుకున్న కథ, జాతీయ గౌరవాన్ని పొందిన ఆలోచన దర్శకుడు క్రిష్‌ది. సినిమాలోని దృశ్యాలు, పదునైన సంభాషణలు జనం గుండెల్లోకి దూసుకెళ్లేలా రాసిన కలం సాయిమాధవ్ బుర్రాది. కంచె సినిమా విజయంలో కీలకమైన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లావాసులేనని చెప్పుకునే భాగ్యం మనది కృషి అంటే క్రిష్ ‘గమ్యం’తో తానేమిటో రుజువు చేసుకున్న దర్శకుడు క్రిష్. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, తర్వాత వచ్చిన ‘కంచె’ తన వైవిధ్యమైన శైలికి నిదర్శనాలు. స్వస్థలం వినుకొండ. పెరిగిందీ, చదువుకుందీ గుంటూరులోనే. నమ్మిన భావజాలాన్ని ప్రేక్షకులు మనసుల్లోకి ఎక్కించుకునేలా తీస్తున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో విశాఖలో కనిపించిన బాంబు శకలం ఆయనను ఆకర్షించింది. ఆరా తీస్తే అది రెండో ప్రపంచయుద్ధం నాటిదని తేలింది. గూగుల్‌లో జల్లెడ పట్టారు. మ్యూజియంలు చుట్టేశారు. మరోవైపు అందమైన ప్రేమకథకు రూపమిచ్చారు. యుద్ధం, ప్రేమ.. రెండు లేయర్లుగా అల్లుకున్న కథతో సినిమాకు ఉపక్రమించారు. తుపాకుల నుంచి దుస్తుల వరకూ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. రిటైర్డు మిటలరీ అధికారితో వారంరోజులు శిక్షణ ఇప్పించారు క్రిష్. సెల్యూట్ చేయడం, కమాండ్స్ ఇవ్వడం నేర్పించారు. హీరోయిన్గా ముద్దమందారంలాంటి ప్రగ్యా జైస్వాల్‌ను ఎన్నుకున్నారు. కంచెకు ఆయనే కలం కంచె సినిమా చూసిన ప్రేక్షకులు అందులోని సంభాషణలను వెంటనే మరిచిపోలేరు. ప్రేమ గురించి, కులమతాల కంచెల గురించి, దేశాల మధ్య యుద్ధంపై పాత్రల మధ్య వచ్చే మాటలు మనసును తాకుతాయి. ‘నేనంటే ఇష్టమా..?’, కాదండీ...ప్రేమ..!’, ‘రెండింటికీ తేడా ఏంటి?’, ‘గులాబి పువ్వు ఉందనుకోండి. దాన్ని కోస్తే ఇష్టం. నీళ్లు పోస్తే ప్రేమ’ అంటూ సాగిన సంభాషణలు కొత్త అనుభూతుల్లోకి తీసుకెళ్లాయి. కులాల గురించి చెప్పిన పదునైన మాటలూ అంతే. ఆ మాటలు సాయిమాధవ్ బుర్రా కలం నుంచి వచ్చిన వి. వర్ధమాన డైలాగ్ రైటర్లలో బాగా వినిపిస్తున్న పేరు అది. స్వస్థలం తెనాలి. బొల్లిముంత శివరామకృష్ణ శిష్యరికం, చిన్నతనం నుంచీ రంగస్థలంతో ఉన్న అనుబంధం కలిగిన సాయిమాధవ్ తన కలం పదునైందని నిరూపించుకొన్నాడు. క్రెడిట్ అంతా క్రిష్‌దే.. ప్రేమికులు విడిపోవడానికి కులం, డబ్బు వంటి అడ్డుగోడలు ఎప్పట్నుంచో ఉన్నవే. వీటిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కేవలం ప్రేమకే కాకుండా, మనిషి మనిషికి, దేశాలకు మధ్య ఎన్నో రకాల కంచెలున్నాయనే అంశాన్ని రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో కొత్తగా చెప్పడం అందరికీ కనెక్టయింది. తొలి కాపీ చూడగానే కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంద నుకున్నా. క్రిష్ గారితో చెప్పాను. అవార్డు రాగానే ఫోన్‌చేసి ‘నువ్వు అవార్డు వస్తుందన్నావుగా. వచ్చింది’ అన్నారు. చాలా హ్యాపీగా ఉంది. మొత్తం క్రెడిట్ అంతా క్రిష్‌దే. మా వంతు కృషి ఉన్నా మమ్మల్ని చేయిపట్టుకుని నడిపించింది ఆయనే. - సాయిమాధవ్ బుర్రా,కంచె సినిమా మాటల రచయిత ప్రేమ+ప్రపంచ యుద్ధం పకడ్బందీ స్టోరీబోర్డుతో షూటింగ్‌ను 55 రోజుల్లో పూర్తిచేశారు క్రిష్. 30 రోజులు జార్జియా దేశంలో తీయడం మరో విశేషం. కేవలం 20 మంది యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కొన్ని పాత్రలకు జర్మన్ దేశస్థులను తీసుకున్నారు. ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో లోతైన భావజాలాన్ని, క్లిష్టమైన విషయాన్ని సగటు ప్రేక్షకులతో సహా అందరికీ అర్థమయ్యేలా తెరపై ఆవిష్కరించారు. దూపాటి హరిబాబు, సీత భావోద్వేగాలు, కులం చుట్టూ సాగిన సంభాషణలు, పాటల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం... అన్నీ అద్భుతంగా అమరాయి. అందుకే, అన్ని కంచెలను దాటి జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. అవార్డు వస్తుందని ఊహించా.. నేను తీసుకున్న పాయింట్‌పై భిన్నాభిప్రాయాలొచ్చాయి. నా ముందు కొందరు ధైర్యం చెప్పినా, మరికొందరు పరోక్షంగా విమర్శించకపోలేదు. అయినా ధైర్యంగా ముందుకెళ్లాను. నేను చెప్పగలిగింది చెప్పగలిగాను. కొత్తదనం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారు. తప్పకుండా అవార్డు వస్తుందని ఊహించాను. జాతీయ చలనచిత్ర జ్యూరీ నా అంచనాలను నిజం చేసింది. ధన్యవాదాలు. ఈ క్రెడిట్ నాతోపాటు పనిచేసిన చిత్ర యూనిట్ అందరికీ దక్కుతుంది. ఈ విజయంతో దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగింది. - క్రిష్, దర్శకుడు -
చిరంజీవి ప్రశంసలతో చెమటలు పట్టాయి..
‘ఏ కులమూ తక్కువ కాదురా కులమంటే పని.. కమతాన్ని నమ్ముకున్నోడు కమ్మోడయ్యాడు కాపు కాసేవాడు కాపోడయ్యాడు కుమ్మరోడి కుండ, చాకలోడి బండ కంసాలి సేత, సాలీల నేత... ఏదీ వాళ్లు బతకటానిక్కాదు అందరినీ బతికించటానికి... నువ్వెవరంటే ఏం చేస్తుంటావని...నీ నెత్తురేంటీ అని కాదు. అలా అడిగేవాడు అసలు మనిషే కాడు...’ కులాల సరిహద్దులు గీసుకుని కూపస్థ మండూకాల్లా జీవిస్తున్న దురహంకారులకు చెంపపెట్టులాంటి ఈ డైలాగ్ ‘కంచె’ థియేటర్లో పేలుతోంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్‌తేజ, ప్రగ్యాజైస్వాల్ జంటగా దసరాకు విడుదలైన సినిమా మూసచిత్రాలకు భిన్నంగా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తీసింది. ఈ చిత్రానికి సంభాషణలు సాయిమాధవ్ బుర్రా. ఇదేరోజు విడుదలైన హారర్ కామెడీ సినిమా ‘రాజుగారి గది’ సినిమాకూ సంభాషణలు తనవే. కంచె విజయయాత్రలో భాగంగా బుధవారం హీరో హీరోయిన్లతోపాటు తెనాలి వచ్చిన సాయిమాధవ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే... నేను సంభాషణలు సమకూర్చిన సినిమాలు ఒక్కోటీ ఒక్కో జానర్ కావటం, ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందటం హ్యాపీగా ఉంది. ఇలాంటిరోజు రావాలనుకొన్నాను..వస్తుందనుకోలేదు. కృష్ణం వందే జగద్గురుమ్, గోపాల గోపాల, మళ్లీమళ్లీ ఇది రానిరోజు, దొంగాట, ఇప్పుడు కంచె, రాజుగారి గది సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేని కథలు, కంచె సినిమా కథను దర్శకుడు క్రిష్ ఎప్పుడైతే చెప్పారో? ఆ కథ వింటున్నపుడే అలౌకికమైన అనుభూతికి లోనయ్యాను. అర్థగంటసేపు మాటల్లేవు. కథ విన్నపుడు నేను ఎలాంటి ఫీలింగ్స్‌కు లోనయ్యానో, ఇప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకులు అదే ఫీల్‌తో బయటకొస్తున్నారు. అద్భుతమైన ప్రేమ, సభ్యత, సంస్కారం, గతం, మన ఉనికి...ఒక డైలాగ్ రైటర్‌గా నన్ను ప్రూవ్ చేసుకొనే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని, ఆ కాలయానంలో మనుష్యుల మధ్య ఉన్న అంతరాలను అనుసంధానం చేస్తూ ఒక చక్కని కథ, ఆ రెండూ నేపథ్యాలను సమాంతరంగా నడిపిస్తూ పొందికైన కథనం ‘కంచె’లో కుదిరాయి. నా డైలాగులంటారా? సోషల్ మీడియాలో జోరుగా సర్కులేట్ అవుతున్నాయి. క్లాస్, మాస్ ఆదరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా పిలిపించుకొని సినిమాలోని డైలాగులు ఆయన నోటివెంట చెబుతుంటే స్టన్నయిపోయాను. ఆయన ప్రశంసిస్తుంటే నాకు చెమటలు పట్టాయి. ఆయన్ను ట్రెండ్ సెట్టర్ అనేకంటే ఒక కల్ట్ సృష్టించారాయన. ఆయన సినిమాకు మాటలు రాసే అదృష్టం ఉండదేమోనన్న నిరాశలో ఉన్న నాకు, కంచెలోని పదునైన సంభాషణలు ఆయన చెబుతుండటం మధురమైన అనుభూతి. అలాగే ఎక్కడెక్కడ్నుంచో ప్రేక్షకులు ఫోను చేసి ఆర్ద్రతతో అభినందిస్తున్నారు. ఇంత గొప్ప కథ, కథనానికి ఏ రచయితయినా ప్రాణం పెట్టి రాస్తాడు. ఆ అవకాశం నాకు రావటానికి కారణం క్రిష్‌కు నాపై గల నమ్మకం. రొటీన్ ఫార్ములా సినిమాల కాలంలో ఇలాంటి సినిమా కెరీర్లో ఒకసారి రావటమే గొప్ప. తెనాలి నాకిచ్చిన జ్ఞానం నాకు ఉపయోగపడింది. ఇక్కడ్నుంచే ప్రపంచాన్ని తెలుసుకొన్నా. రచయితగా బతుకు, చావు రెండూ సినీపరిశ్రమలోనేనని ఏనాడో నిశ్చయించుకొన్నా. ఆ దారిలో నన్ను నడిపించింది తెనాలి. దర్శకుడు క్రిష్ లేకుంటే నేను లేను. తల్లి రుణం, ప్రేక్షకుల రుణం, తెనాలి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఈ గడ్డమీదనే మళ్లీ మళ్లీ జన్మించాలని నా ఆశ. ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం బ్యాక్‌గ్రౌండ్ ఉండటం నాకు ఉపయోగపడింది. చదివిన పుస్తకాలు, బొల్లిముంత శివరామకృష్ణ సాంగత్యం దోహదపడ్డాయి. చాలా ఏళ్లక్రితం కథ రాసి, ప్రఖ్యాత మాటల రచయిత బొల్లిముంత శివరామకృష్ణకు చూపించా. కథలాగ లేదుకానీ, రాస్తూ ఉండు ఎప్పటికయినా కథవుతుంది అన్నారాయన. ఆయన మాట పట్టుకొని రాసుకుంటూ వెళ్లా...ఇప్పుడు ఒక దారికొచ్చాను. ఆయన బాటలో ప్రస్తుతం అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నా.