RC15: రామ్‌ చరణ్‌-శంకర్‌ ప్రాజెక్ట్‌కు నో చెప్పిన అగ్ర నటుడు | RC15: Is Mohanlal Rejected Shankar, Ram Charan Pan India Movie Offer | Sakshi
Sakshi News home page

Rc15: శంకర్‌ ఆఫర్‌ను తిరస్కరించిన అగ్ర నటుడు, అసలేం జరిగిందంటే

Published Fri, Apr 8 2022 2:38 PM | Last Updated on Fri, Apr 8 2022 5:15 PM

RC15: Is Mohanlal Rejected Shankar, Ram Charan Pan India Movie Offer - Sakshi

డైరెక్టర్‌ శంకర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇటివల సెట్స్‌పైకి వచ్చిన ఈ మూవీ 30 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఈ మూవీని RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభించారు. ఇందులో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదిలా ఉంటే RC15 సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తోంది.

చదవండి: వరుణ్‌ తేజ్‌ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్‌, ట్వీట్‌ వైరల్‌

తాజాగా మరో షాకింగ్‌ అప్‌డేట్‌ నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం RC15లో కీ రోల్‌ కోసం ఓ స్టార్‌ నటుడిని సంప్రదించగా ఆయన ఈ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశాడని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్‌ నటుడు ఎవరో కాదు మలయాళ అగ్ర హీరో మోహన్‌ లాల్‌. ఈ మూవీలో ప్రతికథానాయకుడి పాత్ర కోసం శంకర్‌ అండ్‌ టీం రీసెంట్‌గా ఆయనను సంప్రదించారట. ఈ పాత్ర కథ విన్న ఆయన శంకర్ ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశాడని సినీవర్గాల నుంచి సమాచారం.

చదవండి: బన్నీకి మెగాస్టార్‌ క్రేజీ విషెస్‌, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్‌

ఇందులో అవినీతికి పాల్పడే ఓ బడా రాజకీయ నాయకుడిగా విలన్‌ పాత్ర ఉండనుందని సమాచారం. ఈ రోల్‌ కోసమే ఆయనను అడగ్గా మోహన్‌ లాల్‌ ఈ పాత్రకు ఆసక్తి చూపలేదని ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇటీవల మోహన్‌ లాల్‌ నటించి బ్రో డాడీ చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. కాగా RC15లో రామ్‌ చరణ్‌ ప్రభుత్వ అధికారిక కనిపించనున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement