
హీరో రామ్‌చరణ్–దర్శకుడు శంకర్‌తో ఏఆర్ రెహమాన్ ట్యూన్ అవుతున్నారని టాక్. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ‘దిల్’ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్’ నుంచి ఆయనతో రెహమాన్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’ వంటి పలు చిత్రాలకు ఏఆర్ రెహమానే సంగీతదర్శకుడు. ఇప్పుడు చరణ్–శంకర్ కాంబినేషన్ చిత్రానికి రెహమాన్ ట్యూన్ అవుతున్నారట. ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్‌ని ఎప్పుడు ఆశించవచ్చు?’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘వెరీ సూన్’ అన్నారు రెహమాన్. చరణ్ చిత్రాన్ని ఉద్దేశించే ఆయన అలా అన్నారన్నది చాలామంది ఊహ. కాగా శంకర్‌తో ఇప్పటికే పలు చిత్రాలకు ట్యూన్ అయిన రెహమాన్ ఇప్పటివరకూ చరణ్ చిత్రాలకు సంగీతం అందించలేదు. ఒకవేళ ట్యూన్ అయితే ఇదే తొలి కాంబినేషన్ అవుతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ఆరంభమవుతుంది.