![Shankar multi-starrer In Yash and Ram Charan - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/02/12/Untitled-2.jpg.webp?itok=VMF-vMFD)
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలందరి చేతిలో మినిమమ్ రెండు మూడు సినిమాలు ఉన్నాయి. చేస్తున్న సినిమా కాకుండా మరో రెండు సినిమాల లైనప్ రెడీగా ఉంది. కానీ రామ్‌చరణ్ మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ తప్ప మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. చిరంజీవి ‘ఆచార్య సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరి రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్న నెక్ట్స్ సినిమా ఏంటీ అంటే... రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా కమిటయ్యారట. ఇది మల్టీస్టారర్ చిత్రమని టాక్. రామ్‌చరణ్, యశ్, విజయ్ సేతుపతి ఇందులో హీరోలుగా కనిపిస్తారని సమాచారం. మరొకటి... ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట చరణ్. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment