Mahesh Babu Sorry To Director Shankar: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో శుక్రవారంతో ముగిసింది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టించి ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి చేశాడు. ఆయనతో పాటు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాలయ్య, మహేశ్ బాబుకు సంబంధించిన సీక్రెట్స్‌ను బయటపెట్టించాడు. ఇలా ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ ఎపిసోడ్‌లో మహేశ్ బాబు తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి
కాగా ఈ షో మధ్యలో బాలయ్య డైరెక్టర్ మెహర్ రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మెహర్ రమేశ్ ముంబైలో చోటు చేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేస్తూ.. ఓ సారి ముంబై మారిటన్ హోటల్‌లో మేము టిఫిన్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్ చెప్తాడు అని ఫోన్ పెట్టాశాడు. ఇక దీనికి మహేశ్ బాబు సమాధానం ఇస్తూ.. ‘ముంబైలో మారిటన్ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా ఉంది. ఓ ఇద్దర అమ్మాయిలు వచ్చారు. సెల్ఫీ అని అడిగారు. ఇప్పుడు కాదు.. ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను.
చదవండి: సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్‌లో అందరి ముందే..
దీంతో ఆ అమ్మాయిలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక రమేశ్ నాతో.. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ గారి కూతుళ్లు అని చెప్పాడు. దీంతో వెంటనే పరిగెత్తుకుని కిందకు వెళ్లాను. సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా అని డైరెక్టర్ శంకర్ అన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ ఫ్యామిలీ, మెహర్ రమేశ్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment