
హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాగా శంకర్ మూడో భాగాన్ని కూడా ప్లాన్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ‘ఇండియన్ 2’ షూటింగ్ పూర్తయిందని, ‘ఇండియన్ 3’ షూటింగ్ కూడా 70 శాతం పూర్తయిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ‘ఇండియన్ 2’ విడుదలైన ఏడాది తర్వాత ‘ఇండియన్ 3’ రిలీజ్ అవుతుందని భోగట్టా.