Shankar-RRR: Director Shankar Tweet On RRR Movie, Praises Rajamouli And Team, Check Inside - Sakshi
Sakshi News home page

RRR Movie-Director Shankar: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై శంకర్‌ రివ్యూ, ఏమన్నారంటే..

Published Sat, Mar 26 2022 12:48 PM | Last Updated on Sat, Mar 26 2022 2:38 PM

Director Shankar Tweet On RRR Movie, Praises Rajamouli And Team - Sakshi

Director Shankar Comments On RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ మార్చి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిని సినీ దిగ్గజాలలు సోషల్‌ మీడియా వేదికగా తమ రివ్యూ ప్రకటిస్తు డైరెక్టర్‌ రాజమౌళి, చిత్రం బృందాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంతో తాజాగా సెన్సెషన్‌ డైరెక్టర్‌ శంకర్‌ సైతం ఆర్‌ఆర్‌ఆర్‌పై తన రివ్యూను ప్రకటించారు.

చదవండి: అప్పుడే ఓటీటీకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘‘రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్. రోర్ అన్ని సమయాలలో ప్రతిధ్వనిస్తుంది. అసమానమైన అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీంకు ధన్యవాదాలు. రామ్ చరణ్ ర్యాగింగ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్… తారక్ రేడియంట్ భీమ్ మీ హృదయాన్ని ఆకర్షించారు. మీ ఊహ అజేయంగా ఉంటుంది.. హ్యాట్సాఫ్‌ ‘మహారాజ’మౌళి’ అంటూ ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ RC15 అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: 'మీటూ' అంటే తెలియదు.. కానీ 10 మంది మహిళలతో పడక పంచుకున్నా: నటుడు

ఇక దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబడుతోంది. విడుదలైన మొదటి రోజే ఆర్‌ఆర్‌ఆర్‌.. బాహుబలి 2 రికార్డును బద్ధలు కొట్టిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ థియేటర్‌ ముందు చూసిన అభిమానులు సందడి చూస్తుంటే పండగ వాతావారణాన్ని తలపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కోమురం భీంగా... రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామారాజుగా నటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement