
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో తనకుంటూ ఫేమ్‌తో పాటు నేమ్‌ని సంపాదించుకున్న డైరెక్టర్ శంకర్. ఇండియన్ 2 సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఏదో ఒకలా ఈ దర్శకుడు ప్రొఫెషనల్ పరంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా శంకర్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఎలా అంటారా..? శంకర్‌కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతురు ఐశ్వర్య.. ఇటీవల ఓ క్రికెటర్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక రెండో కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
అయితే అదితి మాత్రం తన కెరీర్‌ని సిని రంగానికే పరిమితం కాకుండా మరోపక్క చదువును కొనసాగించింది. శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అదితి డాక్టర్ డిగ్రీని పొందిన తరువాత భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా ఈ రోజు కోసం నా జీవితంలో ఎన్నో కాపీ కప్పులు, నిద్ర లేని రాత్రులు గడిపానంటూ ట్వీట్ చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు చదువు కొనసాగించడంతో అదితిని మల్టీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అదితి శంకర్ సినిమాల విషయాలకొస్తే.. త్వరలోనే హీరోయిన్‌గా వెండితెరపై ప్రేక్షకులకు పరిచయం కానుంది. ముత్తయ్య దర్శకత్వంలో 'వీరుమన్' అనే చిత్రంతో కోలీవుడ్‌లో తమిళ తంబీలను పలకరించనుంది. ఇందులో కార్తీ హీరోగా నటిస్తున్నాడు.
Here’s to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021
Comments
Please login to add a commentAdd a comment