
తమన్ పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. మరి.. ఏ దర్శకుడి సినిమాలో నటుడిగా కనిపించారో అదే దర్శకుడి సినిమాకి పాటలిచ్చే అవకాశం వస్తే ఆ మాత్రం ఆనందం ఉంటుంది కదా. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ (2003)లో ఐదుగురు యువకుల్లో ఓ యువకుడిగా తమన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు శంకర్ డైరెక్షన్‌లో యాక్టర్‌గా కనిపించిన తమన్ ఇప్పుడు ఆయన సినిమాకి ట్యూన్స్ ఇవ్వనుండటం విశేషం.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించనున్న ప్యాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. ‘‘2000 సంవత్సరం నుంచి శంకర్ సార్‌ని చూస్తున్నాను. సైన్స్‌ని, సినిమాకి మించిన విషయాలను ఆయన ఊహించే విధానం అద్భుతం. ఆయనలో అదే ఉత్సాహం ఉంది. ‘నాయక్’, ‘బ్రూస్‌లీ’ తర్వాత రామ్ చరణ్ సినిమాకి పని చేయనున్నాను. నా బెస్ట్ ఇవ్వ డానికి ప్రయత్నం చేస్తాను’’ అన్నారు తమన్.
Comments
Please login to add a commentAdd a comment