మేకింగ్‌ మార్వ్‌లెస్‌ | Director Shankar Friday 2.O filmmaking video was released on the Internet | Sakshi
Sakshi News home page

మేకింగ్‌ మార్వ్‌లెస్‌

Published Sun, Aug 27 2017 3:17 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

మేకింగ్‌ మార్వ్‌లెస్‌

మేకింగ్‌ మార్వ్‌లెస్‌

తమిళసినిమా: తమిళసినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ తరం దర్శకుల్లో శంకర్‌ ప్రథమ స్థానంలో ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన తొలిచిత్రం జెంటిల్‌మెన్‌ నుంచి సిల్వర్‌స్క్రీన్‌పై గ్రాండియర్‌ను ఆవిష్కరిస్తూ, వండర్‌ను క్రియేట్‌ చేస్తూ వస్తున్నారు. శంకర్‌ చిత్రం అంటేనే బ్రహ్మాండం అనిపించుకుంటున్నారు. వెలుగొందుతున్న శంకర్, ఇక ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్, స్టైల్‌కింగ్, సూపర్‌స్టార్‌ కాంబినేషన్‌లో చిత్రం అంటే ఆ క్రేజ్‌ ఎలా ఉంటుందో ఇప్పటికే శివాజీ, ఎందిరన్‌(రోబో) చిత్రాలు చూశాం. ఈ సెన్సేషనల్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా హాట్రిక్‌కి సిద్ధం అవుతున్న చిత్రం 2.ఓ. రజనీకాంత్‌కు జంటగా ఇంగ్లిష్‌ బ్యూటీ ఎమీజాక్సన్‌ నటిస్తున్న ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా విజృంభిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ తన సంగీత బాణీలతో మెస్మరైజ్‌ చేయనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. సాధారణంగానే శంకర్‌ తను పెట్టించే ప్రతి పైసాకు ఫలితాన్ని చిత్రంలోని ప్రతి ఫేమ్‌లోనూ చూపిస్తారు.

వావ్‌ 2.ఓ మేకింగ్‌
సహజంగానే 2.ఓ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొంటాయి. కాగా దర్శకుడు శంకర్‌ ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు తప ట్విట్టర్‌లో ప్రకటించి రజనీకాంత్‌ అభిమానుల్లో సరికొత్త ఫీవర్‌ను కలిగించారు. ఆ సన్నివేశాలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం దర్శకుడు శంకర్‌ శుక్రవారం సాయంత్రం సరిగ్గా 6 గంటలకు 2.ఓ చిత్ర మేకింగ్‌ వీడియోను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు

. అది చూసిన అభిమానులే కాదు, చిత్ర పరిశ్రమ వర్గాలు వావ్‌ బ్రహ్మాండం అంటూ ముక్త కంఠంతో అంటున్నారు. 1.47 నిడివి కలిగిన ఆ మేకింగ్‌ వీడియోలో చిత్రం కోసం వేసిన భారీ సెట్స్, గ్రాఫిక్స్‌ కార్యక్రమాలు బ్లూమెట్‌ స్టూడియోలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, ఎమీజాక్సన్‌ల సన్నివేశాల చిత్రీకరణ దృశ్యాలు, భారీ చేజింగులు, అనేక రోబోల దృశ్యాలు, కార్లు, ఫిరంగుల ఫైరింగ్‌ దృశ్యాలు అబ్బుర పరిచాయి.

ఈ రెండు నిమిషాల్లోపు 2.ఓ చిత్ర మేకింగ్‌ దృశాలను చూసే హాలీవుడ్‌ స్థాయిలో ఉన్నాయంటూ ఆశ్యర్యానికి గురౌతున్న ప్రేక్షకుల్లో చిత్రంపై ఆసక్తి, అంచనాలు మరింత పేంచేశాయనే చెప్పాలి.2.ఓ చిత్ర మేకింగ్‌ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే 2.5 మిలియన్ల మంది వీక్షించారు. అదే విధంగా లక్ష మంది అభిమానులు లైక్‌ చేశారు.ఇది సంచలన రికార్డేనంటున్నారు సినీ వర్గాలు. కాగా ఇప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసుకున్న 2.ఓ చిత్రంలోని ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. అయితే చిత్ర నిర్మాణాంతర కార్యక్రమల్లో శంకర్‌ సైన్యం ముమ్మరంగా ఉంది.చిత్రాన్ని 2017 జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement