
ఆర్తి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: భర్తతో ఘర్షణ పడిన ఓ యువతి 8 నెలల కూతురితో సహా రెండంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. బిహార్‌కు చెందిన బిమల్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ, భార్య ఆర్తి (22)తో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.30కి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్తి తన కూతురుతో సహా బయటకు వచ్చి ఇంటి గడియ వేసి భవనం రెండో అంతస్తుకు వెళ్లి కిందికి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి గడియ తీసి భర్తకు విషయం చెప్పారు. బాధితురాలితో పాటు చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆర్తి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment