దొంగ... పోలీస్ అయితే! | If the thief ... Police! | Sakshi
Sakshi News home page

దొంగ... పోలీస్ అయితే!

Published Tue, Aug 18 2015 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

దొంగ... పోలీస్ అయితే! - Sakshi

దొంగ... పోలీస్ అయితే!

తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు విడిచిన పోలీస్ సిద్ధయ్య జీవిత కథ నేపథ్యంలో తెర కెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ కె’. కౌశిక్ బాబు, ఆర్తి జంటగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేశ్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.  నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యథార్థ సంఘటనల నేపథ్యంలో క్రైం కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
 
 ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ‘‘పోలీస్ డ్రస్ వేసుకుని తిరిగే దొంగ కథ ఇది. తర్వాత ఆ దొంగే  పోలీస్ ఎలా అయ్యాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పోలీసు సిద్ధయ్య పాత్రను పోసాని కృష్ణమురళి పోషిస్తున్నారు’’ అని కౌశిక్ బాబు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శారదా విజయబాబు, మాటలు: మోహన్ దీక్షిత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement