the thief
-
చోరీకి యత్నించిన దొంగపై వాచ్ మెన్ దాడి.. అక్కడికక్కడే మృతిచెందిన దొంగ
-
మంత్రి శంకర్ మళ్లీ చిక్కాడు!
37 ఏళ్లలో 24 సార్లు అరెస్టు 228 చోరీ కేసుల్లో నిందితుడు తాజాగా నాలుగు చోట్ల పంజా సిటీబ్యూరో: ఘరానా దొంగ మంత్రి శంకర్ మరోసారి చిక్కాడు. గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు.. తాజాగా నాలుగు చోట్ల పంజా విసిరాడు. నిందితుడిని అరెస్టు చేసిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ.4 లక్షల విలువైన సొత్తు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడకు చెందిన మంత్రి శంకర్ 1979 నుంచి చోరీలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 228 కేసుల్లో నిందితుడిగా ఉండి 24 సార్లు అరెస్టయి జైలుకు వెళ్లాడు. ఐదు కేసుల్లో దోషిగా తేలడంతో న్యాయస్థానం ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది. ఇతడిపై చిలకలగూడ ఠాణాలో సిటీ డోషియర్ క్రిమినల్ (సీడీసీ) షీట్ కూడా ఉంది. జంట కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరే ఇతడికి శివన్న, శివప్రసాద్ వంటి మారు పేర్లూ ఉన్నాయి. 1998 నుంచి 2009 వరకు రామంతపూర్‌లోని నేతాజీనగర్‌లో నివసించాడు. 2009 నుంచి తన మకాంను మహారాష్ట్రలోని లాథూర్ జిల్లాలోని ఔసా పట్టణానికి మార్చాడు. ముగ్గురు భార్యలు, ఏడుగురు సంతానం ఉన్న శంకర్ ప్రస్తుతం మూడో భార్య షాలినితో కలిసి జీవిస్తున్నాడు. ‘సింగిల్ హ్యాండ్’తో నేరాలు చేసే ఇతగాడు ద్విచక్ర వాహనంపై సంపన్నులు నివసించే ప్రాంతాల్లో సంచరిస్తూ రెక్కీ చేస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి ప్రధాన ద్వారం పగులగొట్టి లోపలకు ప్రవేశించి సొత్తు ఎత్తుకుపోతాడు. దీన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ జల్సాలు చేస్తాడు. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో చోరీలు చేసిన ఆరోపణలపై 2014లో బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. 2015లో ఉస్మానియా వర్సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించడంతో గత నెలలోనే జైలు నుంచి బయటకు వచ్చాడు. వస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ, బోయిన్పల్లి, నాచారంతో పాటు కూకట్‌పల్లిలోనూ నాలుగు నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎల్.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. మంత్రి శంకర్ నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకుని కేసును ఓయూ పోలీసులకు అప్పగించారు. -
కళ్లల్లో కారంకొట్టి... దొంగను పట్టుకున్న మహిళలు
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బుడేసాయిబ్ వీధిలో పట్టపగలే చోరీకి యత్నించిన ఓ దొంగను మహిళలు ధైర్యం చేసి కళ్లల్లో కారం కొట్టి పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బుడేసాయిబ్వీధిలోని బడుగు శివయ్య ఇంటికి తాళం వేసి ఉండగా... ఓ దొంగ దాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అది చూసిన మహిళలు ఇంటి బయట గడియపెట్టారు. దీంతో తాను ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో అతడు కత్తి తీసుకుని తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు. అక్కడున్న వారిపై కత్తితో దాడికి దిగాడు. ఓ ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న మహిళలు అతడి కళ్లల్లో కారం చల్లి వెంటనే కాళ్లు పట్టుకుని కిందకు నెట్టేశారు. చివరికి అతడ్ని పోలీసులకు అప్పగించారు. -
చేసిన చోటే రెండో సారి చోరీ... దొరికిపోయిన దొంగ
ఒకే షాపులో రెండు సార్లు చోరీ చేసిన వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల కధనం మేరకు.. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కిరాణా షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం చోరీ విషయాన్ని గమనించిన యజమాని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో తన షాపులో చోరీ చేసిన వ్యక్తే.. ఈ పనికి పాల్పడి ఉంటాడని.. అనుమానించి.. మురుగన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చోరీ తానే చేశానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. నిందితుని వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఓ బంగారు ఉంగరం చోరీ చేసినట్లు తెలుస్తోంది. -
దొంగ... పోలీస్ అయితే!
తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు విడిచిన పోలీస్ సిద్ధయ్య జీవిత కథ నేపథ్యంలో తెర కెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ కె’. కౌశిక్ బాబు, ఆర్తి జంటగా శశాంక్ వోలేటి దర్శకత్వంలో ఆకుల లోకేశ్, నూకల చిట్టిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘యథార్థ సంఘటనల నేపథ్యంలో క్రైం కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ‘‘పోలీస్ డ్రస్ వేసుకుని తిరిగే దొంగ కథ ఇది. తర్వాత ఆ దొంగే పోలీస్ ఎలా అయ్యాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో పోలీసు సిద్ధయ్య పాత్రను పోసాని కృష్ణమురళి పోషిస్తున్నారు’’ అని కౌశిక్ బాబు చెప్పారు. ఈ చిత్రానికి కథ: శారదా విజయబాబు, మాటలు: మోహన్ దీక్షిత్. -
శివ..శివా!
గుంటూరు క్రైం/నరసరావుపేటరూరల్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను నిజం చేయజూసిన దేవాలయ ఉద్యోగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆలయంలో దొంగిలించిన విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి.. నరసరావుపేట మండలం కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు నలభై ఏళ్లుగా ఇత్తడి మండపవాహుకలు ఉన్నాయి. ప్రస్తుత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు 2013లో వాటి స్థానంలో వెండి విగ్రహాలను సమర్పించారు. దీంతో గతంలో ఉన్న ఇత్తడి విగ్రహాలను ఆలయ అధికారులు స్టోర్‌రూమ్‌లో భద్రపరిచారు. ఈ ఆలయంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండే కొండకావూరుకు చెందిన దుర్గా కోటేశ్వరరావు స్టోరూంలో వున్న 60 కిలోల బరువుగల రెండు ఇత్తడి విగ్రహాలను దొంగిలించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం మరో ఐదుగురు వ్యక్తులతో చేతులు కలిపి, విగ్రహాలను చోరీ చేశాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు కోటప్పకొండకు చెందిన ముగ్గురు, పిడుగురాళ్ళ, గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు వారం క్రితం గుంటూరులోని పాత ఇత్తడి కొనుగోలుదారుల వద్దకు వెళ్లారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అర్బన్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిండంతో విగ్రహాల చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో విషయాన్ని నరసరావుపేట రూరల్ పోలీసులకు చేరవేసి దేవాలయ ఇన్చార్జ్ ఈవోకు కబురు చేశారు. చిత్రం ఏమిటంటే దొంగలు పోలీసుల చేతికి చిక్కే వరకూ కనీసం దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం ఆలయ అధికారులు గుర్తించలేదు. నరసరావుపేట రూరల్ పోలీసులు సమాచారం అందించడంతో స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు గత నెల 28వ తేదీన ఆలయ ఈవో డి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సైతం రహస్యంగా ఉంచారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు ఇత్తడి విగ్రహాలనూ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులు అర్బన్ సీసీఎస్ పోలీసుల అదుపులో ఉండటంతో నిందితులను నేడో, రేపో అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. -
‘ఒక పోలీసు-ఒక దొంగ’
అనంతపురం క్రైం : దొంగల్లో మానసిక పరివర్తన తీసుకురాగలిగితే కొంతలో కొంతైనా నేరరహిత సమాజాన్ని నిర్మించవచ్చననే అభిప్రాయంతో ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఒక దొంగ-ఒక పోలీసు’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం దొంగల జాబితా సిద్ధం చేయించి ప్రతి దొంగకు ఒక పోలీస్‌ను కేటాయించి వారిని నిత్యం సంస్కరించేలా విధులు అప్పగిస్తూ తయారు చేసిన పుస్తకాన్ని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘ఒక దొంగ-ఒక పోలీసు’ కార్యక్రమంపై మాట్లాడారు. పుట్టుకతోనే ఎవరూ దొంగలు కారన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, సరిపడే సంపాదన లేకపోవడం, విలాసాలకు అలవాటు పడడం, విచక్షణా పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాల వల్ల దొంగలు, నేరస్తులుగా మారుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి, ఇటు సమాజానికి భారమవుతారన్నారు. చివరకు వారు కూడా ప్రశాంతత కోల్పోయి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతుంటారన్నారు. దొంగతనం ఎప్పటికీ దాగదన్నారు. ఏదో ఒకరోజు బయటపడుతుందని, ఆర ోజు ఊసలు లెక్కించాల్సి వస్తుందన్నారు. మరోవైపు సొమ్ము పోగొట్టుకున్న బాధితుల ఆవేదన చెప్పలేదన్నారు. బిడ్డ పెళ్లికోసమో, పిల్లల చదువుల కోసమో, ఇంటి అవసరాలకో, వైద్యఖర్చులకో అప్పులు చేసి దాచుకున్న సొమ్మును దొంగలిస్తే వారు ఎంతటి బాధను అనుభవిస్తారో ఊహించలేమన్నారు. ఈ క్రమంలోనే దొంగల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్రాను. జిల్లాలో 2500 మంది దొంగలు : సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో దొంగల జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 2500 మంది దొంగలున్నట్లు గుర్తించారు. వీరిలో ఐదు, అంతకంటే ఎక్కువనేరాలు పాల్పడిన వారు 130 మందికాగా, మిగిలినవారు ఐదులోపు నేరాలు చేసినవారే. వీరికి ఏఎస్ఐ నుంచి హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల వరకూ ఒక్కొక్కరినీ కేటాయించారు. నిత్యం నిఘా ఉంచడంతోపాటు దొంగల ప్రవర్తనపై దృష్టిసారిస్తారు. దొంగలను దొంగలుగా చూడకుండా వారిలో పరివర్తన తెచ్చేందుకు అందరం కృషి చేద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు. ‘దొంగల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తాం’ అని పోలీసులు, ‘దొంగతనాలు మానేస్తాం’ అని దొంగలతో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు మాల్యాద్రి, అభిషేక్ మహంతి, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.