నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బుడేసాయిబ్ వీధిలో పట్టపగలే చోరీకి యత్నించిన ఓ దొంగను మహిళలు ధైర్యం చేసి కళ్లల్లో కారం కొట్టి పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని బుడేసాయిబ్ వీధిలో పట్టపగలే చోరీకి యత్నించిన ఓ దొంగను మహిళలు ధైర్యం చేసి కళ్లల్లో కారం కొట్టి పట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బుడేసాయిబ్‌వీధిలోని బడుగు శివయ్య ఇంటికి తాళం వేసి ఉండగా... ఓ దొంగ దాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అది చూసిన మహిళలు ఇంటి బయట గడియపెట్టారు. దీంతో తాను ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో అతడు కత్తి తీసుకుని తలుపులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు. అక్కడున్న వారిపై కత్తితో దాడికి దిగాడు. ఓ ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. ఇక లాభం లేదనుకున్న మహిళలు అతడి కళ్లల్లో కారం చల్లి వెంటనే కాళ్లు పట్టుకుని కిందకు నెట్టేశారు. చివరికి అతడ్ని పోలీసులకు అప్పగించారు.