చేసిన చోటే రెండో సారి చోరీ... దొరికిపోయిన దొంగ | thief caught with cash and gold | Sakshi
Sakshi News home page

చేసిన చోటే రెండో సారి చోరీ... దొరికిపోయిన దొంగ

Published Sun, Sep 13 2015 3:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

thief caught with cash and gold

ఒకే షాపులో రెండు సార్లు చోరీ చేసిన వ్యక్తి చివరకు పోలీసులకు చిక్కాడు.  పోలీసుల కధనం మేరకు.. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కిరాణా షాపులో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం చోరీ విషయాన్ని గమనించిన యజమాని.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో తన షాపులో చోరీ చేసిన వ్యక్తే.. ఈ పనికి పాల్పడి ఉంటాడని.. అనుమానించి.. మురుగన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చోరీ తానే చేశానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. నిందితుని వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఓ బంగారు ఉంగరం చోరీ చేసినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement