లిమా (పెరూ): ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో భారత అథ్లెట్ ఆర్తి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
17 ఏళ్ల ఆర్తి 10,000 మీటర్ల దూరాన్ని 44 నిమిషాల 39.39 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో 47ని:21.04 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. జుమా బైమా (చైనా; 43ని:26.60 సెకన్లు) స్వర్ణం, మీలింగ్ చెన్ (చైనా; 44ని:30.67 సెకన్లు) రజతం గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment