సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై ఇస్లామిక్ సెమినరీ దారుల్ ఉలూమ్ దియోబంద్ మరో వివాదాస్పద ప్రకటన చేసింది. ఫుట్‌బాల్ క్రీడను ముస్లిం స్త్రీలు చూడరాదని పేర్కొంది. పురుషులు ఎలాంటి ఆచ్ఛాదన లేని మోకాళ్లను ప్రదర్శిస్తూ ఫుట్‌బాల్ ఆడటాన్ని స్త్రీలు వీక్షించడం ఇస్లాంకు విరుద్ధమని పేర్కొంది. ‘షార్ట్స్‌తో ఎలాంటి ఆచ్ఛాదన లేని మోకాళ్లను చూపుతూ పురుషులు ఫుట్‌బాల్ ఆడతారు...అలాంటి ఆటను స్త్రీలు చూడటం ఇస్లాంకు విరుద్ధ’మని ముఫ్తీ అతర్ కస్మీ స్పష్టం చేశారు.
వివాదాస్పద ఆదేశాలు జారీ చేయడం ఇస్లామిక్ సెమినరీకి ఇదే తొలిసారి కాదు. బ్యాంకింగ్ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో ముస్లింలు వివాహాలు చేసుకోరాదాని ఇటీవల ఫత్వా జారీ చేసింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం రుణంపై వడ్డీ వసూలు చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇక ఫుట్‌బాల్ క్రీడను మహిళలు చూడరాదని ఆదేశించడం వివాదాస్పదమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment