ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షి | Fatwa against model Arshi Khan for cricketer Shahid Afridi sex tweet | Sakshi
Sakshi News home page

ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షి

Published Mon, Nov 2 2015 11:47 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షి

ఆఫ్రిదిపై కామెంట్స్.. చిక్కుల్లో ఆర్షి

కోల్ కతా: పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని సంచలన ప్రకటన చేసిన మోడల్, బాలీవుడ్ నటి ఆర్షి ఖాన్ చిక్కుల్లో పడింది. ఆమెకు వ్యతిరేకంగా పాకిస్థాన్ లో ఫత్వా జారీ అయింది. పాక్ కు చెందిన మత సంస్థకు ఆమె ఫత్వాకు జారీచేసింది. తనకు ఫత్వా జారీ చేయడంపై ఆర్షి ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

'నాకు ఫత్వా జారీ చేయడం నిరుత్సాహం కలిగించింది.  నాకు మద్దతుగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాకిస్థాన్ ఇక ఇటువంటి చర్యలు మానుకోవాలి' అని ఆమె ట్వీట్ చేసింది.

షాహిద్ ఆఫ్రిదితో తనకు శారీరక సంబంధం ఉందని ఆర్షిఖాన్.. సెప్టెంబర్ లో తన ట్విటర్ పేజీలో పోస్టు చేసింది. 'ఆఫ్రిదితో ఏకాంతంగా గడిపా. ఎవరితోనైనా ఏకాంతంగా గడపాలంటే ఇండియా మీడియా పర్మిషన్ కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం' అంటూ సంచలన ట్వీట్ చేసింది. కాగా, ఆర్షిఖాన్ వ్యక్తిగత జీవితంలోకి చొరబడే హక్కు ఎవరికీ లేదంటూ సోషల్ మీడియాలో ఆమెకు పలువురు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement