
సౌదీ మత పెద్దల షాకింగ్ ఫత్వా
గ్లోబల్ క్రేజీ గేమ్ పోకిమాన్ గో ఆటపై సౌదీ మత పెద్దలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. 'పోకీమాన్ గో ' కు వ్యతిరేకంగా సౌదీ ముస్లి గురువులు ఫత్వా జారీ చేశారు.
రియాద్: గ్లోబల్ క్రేజీ గేమ్ పోకిమాన్ గో ఆటపై సౌదీ మత పెద్దలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న 'పోకీమాన్ గో ' కు వ్యతిరేకంగా సౌదీ ముస్లి గురువులు ఫత్వా జారీ చేశారు. ఇస్లామిక్ కు వ్యతిరేకంగా వున్నందువల్లే ఈ ఆటపై నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు.
కాగా జీపీఎస్ బేస్డ్ పొకేమాన్ గో గేమ్ సృష్టిస్తున్న ప్రకంపనలు వరసగా ఒక్కో దేశాన్ని తాకుతున్నాయి. కాల్పనిక ప్రపంచానికి రియల్ వరల్డ్ కు ముడిపెడుతూ రూపొందిన క్రేజీ గేమ్ పై ఇప్పటికే ఇండోనేషియా దేశం సైనిక, పోలీసులు ఉద్యోగుల వాడకంపై పాక్షిక నిషేధం విధించింది. విధినిర్వహణలో ఈఆట ఆడడానికి వీల్లేదని ఆదేశాలుజారీ చేసిన సంగతి తెలిసిందే.