బెజవాడలో అర్థరాత్రి చర్చి కూల్చివేత | chandrababu govt demolish rcm church in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో అర్థరాత్రి చర్చి కూల్చివేత

Published Mon, Aug 1 2016 7:47 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

chandrababu govt demolish rcm church in vijayawada

విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రసిద్ధ ఆర్‌సీఎంకు చెందిన సెయింట్ పీటర్స్ కేథడ్రిల్ చర్చిను ఆదివారం అర్థరాత్రి సమయంలో అధికారులు కూల్చి వేశారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందంటూ భారీ యంత్రాలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చర్చి వద్దకు అధికారులు చేరుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న చర్చిని కూల్చవద్దంటూ క్రైస్తవులు అధికారులను వేడుకున్నారు.

వారికి వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌కే అసీఫ్, బొల్ల విజయ్‌కుమార్ తదితరులు వారికి మద్దతుగా నిలిచారు. చర్చిని కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులను వెనక్కి నెట్టి చర్చిని ధ్వంసం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను చూసి క్రైస్తవ సోదరులు ఆయనకు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement