సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి నామపత్రాలు చూసి ఖరారు చేశారు. అమెరికా పౌరసత్వం ఉండడంతో తన నామినేషన్ రద్దు చేస్తారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు షబానా. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ కారణంగానే షబానాను చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిపారు.
Comments
Please login to add a commentAdd a comment