
వెల్లంపల్లి శ్రీనివాస్
సాక్షి, విజయవాడ : వించిపేట్‌లో జెండా చెట్టును తొలగించి మటన్ షాప్ ఏర్పాటు చేయడంలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పవిత్రమైన జెండాలను రోడ్డుపై పడేసి మటన్ షాపు ఏర్పాటు చేశారని విమర్శించారు.
షాప్ ఏర్పాటును అడ్డుకున్న వారిపై జలీల్ ఖాన్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. మైనారిటీ ఆస్తులను కాపాడాల్సిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ షాప్ యజమానికి అండగా ఉండటం దారుణమన్నారు. జలీల్ ఖాన్, సలీం, అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment