Mutton shop
-
బాక్స్ కథా చిత్రం: ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో..
అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు దూరం.. 63 కిలోమీటర్లు మధురవాడ నుంచి కాపులుప్పాడకు దూరం.. 8 కిలోమీటర్లు ఇందులో ఏది దగ్గరని ఒకటో తరగతి పిల్లాడిని అడిగినా ఠక్కున సమాధానం చెబుతారు. కానీ ఘనత వహించిన జీవీఎంసీలోని కాంట్రాక్టర్లు మాత్రం మధురవాడ నుంచి కాపులుప్పాడకే దూరం ఎక్కువ అని చెబుతున్నారు. జీవీఎంసీలోని ప్రజారోగ్యశాఖ అధికారులు సైతం అవునంటూ తాళం వేస్తున్నారు. అంతేకాదు మీరు చెప్పిన సమాధానమే కరెక్టేనంటూ బహుమతి కింద కాంట్రాక్ట్‌ను సైతం అప్పగించారు. ఈ కథేంటో.. ఇందులో మతలబు ఏంటో.. ఈ బాక్సు టెండర్ల వ్యవహారమెంటో తెలుసుకుంటే మతిపోతోంది. సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు బాక్సు టెండర్లు పిలిచారు. ఓ నెలలో ఒక షాపు నుంచి వచ్చే చికెన్/మటన్ వ్యర్థాలను మధురవాడ నుంచి కాపులుప్పాడకు తరలించేందుకు రూ.110కు కాంట్రాక్టర్లు కోట్ చేసి పనులను దక్కించుకున్నారు. అయితే, అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు ఇవే వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.100 మాత్రమే కోట్ చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు సైతం గుడ్డిగా తలూపి పనులను అప్పగించారు. ఈ లెక్కన అనకాపల్లి నుంచి కాపులుప్పాడకు చికెన్ వ్యర్థాలను తరలించేందుకు అయ్యే వ్యయం కంటే.. మధురవాడ నుంచి కాపులుప్పాడకు అయ్యే వ్యయమే ఎక్కువని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ఇందుకు జీవీఎంసీ అధికారులు కూడా అవునంటూ పనులను అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంలో అసలు ‘చేపల’ కథ వేరే ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ వద్దు.. బాక్సులే ముద్దు...! వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని చికెన్, మటన్ షాపుల్లో వ్యర్థాలను తరలించేందుకు టెండర్లను గత ఏడాది జూన్‌లోనే పిలిచారు. కరోనా నేపథ్యంలో దీనిని రద్దు చేశారు. తాజాగా తిరిగి టెండర్లను పిలిచారు. అయితే ఆన్లైన్ టెండర్లు కాకుండా బాక్సు టెండర్లను ఆహ్వానించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆన్లైన్ టెండర్లను ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే చేపడుతున్నారు. అయితే, జీవీఎంసీలో మాత్రం బాక్సులను వదలడం లేదు. అందులోనూ ప్రజారోగ్య విభాగంలోనే అధికంగా బాక్సు టెండర్లను ఆశ్రయించడంలో ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నకు సమాధానం అంతుచిక్కడం లేదు. అక్కడ రూ.100.. ఇక్కడ రూ.110 జీవీఎంసీ పరిధిలో 2019 లెక్కల ప్రకారం 1,600 చికెన్, మటన్ షాపులున్నాయి. రోజూ ఈ షాపుల నుంచి వచ్చే 60 టన్నుల వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకు టెండర్లు ఆహ్వానించగా పలు విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లిలో సేకరించిన వ్యర్థాలను కాపులుప్పాడకు తరలించేందుకు షాపునకు రూ.100 అయితే, మధురవాడలోని షాపుల నుంచి సేకరించిన వ్యర్థాలను తరలించేందుకు మాత్రం రూ.110 లెక్క టెండర్లను దక్కించుకోవడం గమనార్హం. వాస్తవానికి అనకాపల్లితో పోల్చుకుంటే మధురవాడ చాలా దగ్గర. అయినా ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. చేపల యజమానుల చేతివాటమని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి సేకరించిన వాటిని యలమంచిలి, పెందుర్తిలోని చేపల చెరువులకు తరలించవచ్చనేది వారి ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. అయితే ఇది చట్టరీత్యానేరం. దీనిపై జీవీఎంసీతో పాటు మత్స్యశాఖ అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. -
అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్ మంచిదేనా?
నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ టౌన్, దేవరకొండ : ఎక్కడ పడితే అక్కడే కోతలు.. ఎవరి ఇష్టం ఉన్నవి వారు ఎక్కడైనా కోసేసుకోవచ్చు.. అవి రోగాలు ఉన్నవా.. లేనివా చూసి పరీక్షించే వారులేరు. అవి ఆడవా.. మగవా అనేది కూడా ఎవరికీ తెలియదు. శుభ్రం ఉండదు. నీరు సక్రమంగా ఉండవు. ఇదీ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో జంతు వధలు సాగుతున్న పద్ధతి. వీటన్నింటికీ ప్రధాన కారణం వధశాలలు లేకపోవడమే. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైన నల్లగొండ, మిర్యాలగూ డ, దేవరకొండలో రోడ్లపైనే మటన్ విక్రయాలు సా గుతున్నాయి. గొర్రెలు, మేకల ద్వారా అంత్రాక్స్ వ్యాధులు వస్తున్నాయనే ప్రచారం సాగిన సమయంలో అధికారులు మటన్‌షాపుల వద్దకు వచ్చి హాల్చల్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం మటన్‌షాపు నిర్వాహకులు కోస్తున్న గొర్రెలు, మేకలను ఆరోగ్యంగా ఉంటున్నాయా లేదా అనేది పరీక్షించే అధికారి జాడ కూడా లేకుండా పోయింది. మున్సిపల్ శానిటరీ విభాగం అధికారులు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు మాంసం కొనాలంటే హడలిపోతున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85) నల్లగొండలో రోడ్డు వెంట సాగుతున్న వధ ధ్రువీకరించాకే వధించాలి.. వధించే గొర్రెలు, గొర్రె పొట్టేళ్లు, మేకలు, మేక పోతులు తదితర వాటిని అక్కడ పశువైద్యులు పరిశీలించి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించిన తరువాత మాత్రమే వాటిని కోయాలి. వధశాలలు ఉంటే అక్కడ ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉండేది. వధశాలలు లేకపోవడంతో నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లోనే జీవాలను వధిస్తూ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించకుండానే వినియోగదారుల చెంతకు మాంసం చేరిపోతోంది. అంతే కాకుండా వాటి వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండలో శిథిలావస్థలో వధశాల నీలగిరి పట్టణంలో జంతు వధశాల 40 ఏళ్ల కిందటి వరకు లైన్వాడిలో ఉన్నట్లు మాంసం వ్యాపారులు చెబుతున్నారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని పనులు మొదలు పెట్టగానే అక్కడ మార్కెట్ వద్దంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాలుగేళ్ల కిందటనే పనులు నిలిచిపోయాయి. దీని గురించి అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ సరిగా పట్టించుకోకపోవడంతో కోర్టు కేసు పరిష్కారం కాక మార్కెట్ పనులకు మోక్షం కలగడంలేదు. పానగల్ బైపాస్ రోడ్డులో జంతు వధశాల నిర్మాణం చేపట్టాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. పట్టణంలో మాంసం విక్రయించే వారు 40 మంది వరకు ఉండగా, ఇక ఆదివారం మాత్రం దాదాపు 200 మంది జంతు వధ చేసి వ్యాపారం చేస్తున్నారు. (చదవండి: Vikarabad: కారుతో ఢీకొట్టి పరార్.. ప్రమాదమా? హత్యాయత్నమా?) నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్ దేవరకొండలో.. రోడ్లపైనే విక్రయాలు ప్రతి ఆదివారం దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 500 కేజీల వరకు మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ వధశాల లేకపోవడంతో రోడ్ల వెంటే మాంసం విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతో బక్కచిక్కిన, అనారోగ్యం పాలైన జీవాలను కూడా కొంతమంది వ్యాపారులు వధించి విక్రయిస్తున్నారు. దీంతో డబ్బులు పోసి జబ్బులు తెచ్చుకోక తప్పడం లేదని ప్రజలు మాంసాహార ప్రియులు వాపోతున్నారు. పట్టణంలో వధశాలనిర్మించి సంబంధిత అధికారులు ధ్రువీకరించిన తర్వాతనే మాంసం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వధశాల ఉన్నా.. నిరుపయోగమే పారిశ్రామికంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడపడితే అక్కడే మటన్ షాపులు వెలుస్తున్నాయి. పట్టణంలో సుమారు 100–200 వరకు మటన్ షాపులుండగా ఏ ఒక్క దుకాణం వద్ద కూడా మున్సిపల్ అధికారులు పరిశీలించి ముద్ర వేసిన దాఖలాలు లేవు. పట్టణంలోని తడకమళ్ల రోడ్డులోని తాళ్లగడ్డ సమీపంలో నిర్మించిన స్లాటర్ హౌజ్ (కబేళా కేంద్రం) నాలుగేళ్లుగా కోర్టు వివాదంలో ఉండడంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో వినియోగదారులు నాణ్యమైన మాసం పొందలేకపోతున్నారు. జంతు వధశాల నిర్మించాలి జంతు వధశాల లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ కోస్తున్నారు. వధశాల నిర్మాణం చేపడితే వ్యాపారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. మటన్ మార్కెట్ నిర్మాణం నిలిచిపోయినా పట్టించుకోవడంలేదు. జంతు వధశాల పెడితే నాణ్యమైన మాంసం వినియోగదారులకు అందుతుంది. వ్యాపారులకు కూడా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. – మహ్మద్ ఆజం, మాంసం వ్యాపారి, నల్లగొండ ఆరోగ్యమా.. అనారోగ్యమా తెలియదు ప్రతి వారం మటన్ తీసుకెళ్తాను. వారు కోసేది ఆరోగ్యంగా ఉన్నదా.. అనారోగ్యంగా ఉన్నదా ఎవరికీ తెలియదు. మటన్‌షాపులు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ లేకుండా పోతోంది. వెటర్నరీ, మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన తరువాతనే గోర్రెలు, మేకలు, పొటేళ్లు కోయాలి. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రెగ్యులర్‌గా వచ్చిన వారికి మాత్రమే మంచి మటన్ ఇస్తున్నారు తప్ప కొత్తవారికి ఇబ్బందులు తప్పవు. – నల్లగుంట్ల నరేష్కుమార్, ఇస్లాంపుర, మిర్యాలగూడ బహిరంగ ప్రదేశాల్లో వధించకూడదు బహిరంగ ప్రదేశాల్లో జీవాలు (గొర్రె, మేక)లను వధించకూడదు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. దేవరకొండ పట్టణంలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబం ధించి స్థలాన్ని పరిశీలిస్తున్నాం. వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని మాత్రమే విక్రయించాలి. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేయకూడదు. ఎప్పటికప్పుడు సంబంధిత పశు సంవర్థక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపడుతాం. – వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్, దేవరకొండ -
మటన్ కత్తి తగిలి బాలుడు మృతి
బహదూర్‌పురా: ప్రమాదవశాత్తు మటన్ షాపులో ఉన్న కత్తి తగిలి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి తన ఇంటి వద్ద మటన్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26వ తేదీన మహ్మద్ ఖురేషి కుమారుడు రియాజ్ ఖురేషి (13) మటన్ షాపులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కత్తి కాలుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా... రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మహ్మద్ ఖురేషి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! ) -
వివాహేతర సంబంధం, మటన్ వ్యాపారి హత్య
సాక్షి, కరీంనగర్: వివాహేతర సంబంధం ఓ మనిషి ప్రాణాలను బలిగొంది. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివారులో మటన్ వ్యాపారి ఎండీ వలీంపాషా ఆదివారం దారుణంగా హత్యకు గురయ్యాడు. తోటి వ్యాపారి సయ్యద్ అప్జల్ తల్వార్‌తో వలీంపాషాపై దాడికి పాల్పడ్డాడు. మెడపై తల్వార్‌తో దాడి చేయడంతో వలీంపాషా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నగరంలోని హుస్సేన్ పురకు చెందిన వ్యక్తి. అదే ప్రాంతానికి చెందిన ఆప్జల్ భార్యతో వలీంపాషాకు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. హత్యకు పాల్పడిన అప్జల్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మాత్రం అతని అరెస్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. సంఘటనా స్థలాన్ని ట్రైనీ ఐపీఎస్ రేష్మా పెరుమాళ్, ఏసిపి విజయసారథి సందర్శించి విచారణ చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
‘ముక్క’ తింటే మటాషే..!
భద్రాద్రి కొత్తగూడెం.: చాలా మందికి ‘ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆదివారం అయితే తప్పకుండా మాంసం ఉండాల్సిందే. మాంసం విక్రయాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అధికారులు నిఘా పెట్టాలి. నాణ్యమైన, పరిశుభ్రమైన మాంసం అమ్ముతున్నారా లేదా అని పరిశీలించాలి. సింగరేణి కార్మిక ప్రాంతమైన కొత్తగూడెంలో ప్రతి ఆదివారం వందల సంఖ్యలో మేకలు, గొర్రెలను కోసి అమ్ముతుంటారు. అయితే రోడ్డు పక్కన ఎలాంటి అద్దాల బాక్స్‌లు, కవర్లు లేకుండా వేలాడదీసిన మటన్‌పై నిత్యం దుమ్ము, దూళి పడుతున్నా.. గుంపులుగా ఈగలు వాలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది తిన్నవారు రోగాలను ‘కొని’తెచ్చుకుంటున్నారు. అధికారుల నిఘా కొరవడడం వల్లే ఇలా జరుగుతోందని, ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటో జర్నలిస్ట్ -
కొంపముంచిన గెట్ టు గెదర్ పార్టీ
-
మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కొంత మంది చేస్తున్న నిర్వాకాల వల్ల కరోనా కట్టడి కాకపోగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా నగరంలోని పహాడీషరీఫ్‌లో మటన్ వ్యాపారి ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీ కొంపముంచింది. ఆ పార్టీకి హాజరైన వారిలో 22 మందికి కరోనా వైరస్ సోకింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ మటన్ వ్యాపారికి జియాగూడలోని బంధువుల ద్వారా సోకినట్టుగా తెలుస్తోంది. పార్టీకి ఆ కుటుంబానికి చెందిన గౌలీపుర, బోరబండ, సంతోష్ నగర్, హర్ష గూడ ప్రాంతాల నుంచి పలువురు హాజరయ్యారు. కాగా.. ఇప్పటికే పహడీషరీఫ్‌లో వారి కుటుంబంలో 14 మందికి బోరబండలో 3, సంతోష్ నగర్లో 2, హర్షగూడలో 4 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరిన్ని శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉంది. చదవండి: జియాగూడలో కొనసాగుతున్న ఇంటింటి సర్వే దీంతో రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు మటన్ వ్యాపారి దగ్గర కొనుగోళ్లు చేసిన వారి గురించి ఆరా తీస్తున్నారు. జియాగూడ, గౌలిపుర, సంతోష్ నగర్, మహేశ్వరం, బోరబండ, హర్షగూడ ప్రాంతాలను కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఇంటింట సర్వేకు గానూ 40 వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకూ మొత్తం 125 కుటుంబాలను పోలీసులు గుర్తించారు. మొదటి కాంటాక్టులో 21 మంది, సెకండ్ కాంటాక్టులో 47 మందిని గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు గ్రీన్ జోన్లుగా ఉన్నవి రెడ్ జోన్లుగా మారటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా -
ముక్క కోసం !
అనంతపురం: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడం కోసం అనంతపురం నగరంలో ఆదివారం చికెన్ , మటన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ముక్కలు దొరకకపోవడంతో మాంసంప్రియులు పల్లెబాట పట్టారు. ద్విచక్ర వాహనాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేశారు. ఇందులో భాగంగానే గార్లదిన్నె సమీపంలోని పంట పొలాల్లో మటన్ కోసం ప్రజలు బారులు తీరారు. – సాక్షిఫొటోగ్రాఫర్ -
మటన్ విక్రయాలపై నిఘా
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని దుకాణాల్లోనూ మటన్ కేజీ రూ.700గా ప్రభుత్వం నిర్ణయించిందని, అంతకుమించి ఎవరైనా అమ్మితే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డా. వకీల్ ఒక ప్రకటనలో తెలిపారు. వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, అందుకు విరుద్ధంగా ఎవరైనా రూ. 700 కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తేదిగువ తెలిపిన అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. కేజీ రూ. 700 అని ప్రజలకు తెలిసేలా దుకాణాల్లో కనబడేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్లు డా.వకీల్ పేర్కొన్నారు. -
‘మాంసం రూ.700’ బోర్డు పెట్టాల్సిందే..
లక్డీకాపూల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే మాంసం షాపులపై చర్యలు తప్పవని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరించారు. మాంసం ధరల నియంత్రణ కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఐదు మంది అధికారులతో కూడిన కమిటీ నియమించారు. ఈ మేరకు వారు సోమవారం ఖైరతాబాద్, మణికొండ, బంజారాహిల్స్ ప్రాంతాలలోని ఎనిమిది మాంసం షాపులలో తనిఖీలు నిర్వహించారు. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బంజారాహిల్స్ రోడ్ నం.11లోని టెండర్ కట్స్ మటన్ షాప్‌ను సీజ్ చేశారు. తనిఖీకి వెళ్లిన సమయంలో షాప్ బయట నో మటన్ బోర్డ్ పెట్టారని లోపలకి వెళ్లి పరిశీలించగా సుమారు 20కిలోల మటన్ కనిపించిందని అధికారులు తెలిపారు. నిల్వ ఉంచిన మటన్ నుంచి దుర్వాసన రావడంతో వెంటనే ఆ షాప్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. మాంసం ధర రూ.700 పేర్కొంటూ బోర్డ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని షాపుల నిర్వహకులను ఆదేశించారు. తనిఖీల్లో అధికారులు డాక్టర్ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, ఖాద్రి పాల్గొన్నారు. -
ధర ఎక్కువ.. నాణ్యత ప్రశ్నార్థకం
కర్నూలు(అగ్రికల్చర్): కొన్నాళ్లు గడిస్తే మాంసం కొనలేని, తినలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలకుమాంసం ధరలు షాక్ కొడుతున్నాయి. దీనికితోడు కొన్ని చోట్ల విక్రయిస్తున్న మాసం పొట్టేలుదో, గొర్రెదో.. మేకదో.. అనారోగ్యంతో ఉన్న వాటిదో తెలియని పరిస్థితి. చనిపోయేవాటిని కూడా విక్రయానికి వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కర్నూలు నగరంలో మాంసం ధరలు ఏకంగా 20 నుంచి 30 శాతం ఎక్కువ. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అయి అడ్డగోలుగా ధరలు పెంచుతూ పోతున్నారు. దీనిని నియంత్రించే అధికారం ఎవ్వరికీ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జీవాల ఆరోగ్యం దేవుడెరుగు ధర ఎక్కువ తీసుకుంటున్నప్పుడు నాణ్యమైన పొట్టేలు మాంసం ఇవ్వాలి. అలా కాకుండా మేక, గొర్రె మాంసం కూడా కిలో రూ. 680 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారులు చూసేందుకు ఎదురుగా ఒక పొట్టేలు తల పెట్టి దాని దాపున గొర్రె, మేకల మాంసం విక్రయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం మాంసానికి వినియోగిస్తున్నా జీవం ఏదైనా అది ఆరోగ్యంగా ఉందా లేదా అని పశుసంవర్ధకశాఖ వైద్యులు పరీక్షించాలి. లేకపోతే బ్రూసెల్లోసిస్, అంత్రాక్స్ వంటి వ్యాధుల బారిన పడిన జీవాలను మాంసానికి వినియోగిస్తే అవి మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే జీవాన్ని పరీక్షించిన తర్వాతే విక్రయించాలని నిబంధన పెట్టారు. జిల్లాలోని మున్సిపాలిటీ, మేజర్ పంచాయతీల్లో ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కర్నూలులో జీవాలను జవ చేయడానికి ప్రత్యేకంగా కమేళా ఉంది. అక్కడ పశువైద్యుడు జీవాల ఆరోగ్యం పరీక్షించిన తర్వాత జవ చేయాలి. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో జీవాల ఆరోగ్యాలను పరీక్షించే పశువైద్యులు అక్కడ లేరు. దీంతో మాంసం వ్యాపారం ఇష్టారాజ్యమైంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై బహిరంగంగా మాంసం విక్రయాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకుని సదరు వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. కర్నూలులో చికెన్ ధరలు కూడా ఎక్కువే జిల్లా కేంద్రానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడుమూరు, వెల్దుర్తి తదితర పట్టణాల్లో చికెన్ కిలో రూ.120 మాత్రమే. కర్నూలు నగరంలో మాత్రం రూ.200 వరకు అమ్మకాలు చేస్తున్నారు. బతికిన కోడి కిలో రూ.40 వరకు ఉంది. చికెన్ దగ్గరకు వచ్చే సరికి ఎక్కడా లేని విధంగా కిలో రూ.200 వరకు ధర పెట్టి అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. లైవ్ ధరల ప్రకారం చూస్తే కిలో చికెన్ రూ.100 నుంచి రూ.110కి మించదు. కాని వినియోగదారుల నుంచి 200 వసూలు చేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మాంసం, చికెన్ అనేవి నిత్యావసరాలు కాదుగదా.. అంటూ అడ్డగోలుగా ధరలు పెంచుకోవడానికి అధికార యంత్రాంగమే వ్యాపారులకు అవకాశం ఇచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏదీ? మూడు నెలలకు ఒకసారి జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరుగాల్సి ఉంది. ఈ కమిటీకి జేసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పశుసంవర్ధకశాఖ జేడీ, నగరపాలక సంస్థ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. కాని రెండేళ్లలో ఒక్కసారి కూడా సమావేశమైన దాఖలాలు లేవు. అంటే ప్రజారోగ్యం పట్ల అధికార యంత్రాంగానికి దృష్టి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టని మాంసం ధరల నియంత్రణ మాంసం ధరల నియంత్రణకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఇందులో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారి తదితరులు సభ్యులుగా ఉంటారు. ధరల నియంత్రణ కమిటీ ఏ నాడు కూడా మాంసం ధర పెరుగుదలపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను నియంత్రించాలిమాంసం ధరలను వ్యాపారులు అడ్డగోలుగా పెంచుకుంటుపోతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కిలో మాంసం ధర రూ.680కు పైగా పెంచినా నాణ్యమైన మాంసం ఇస్తున్నారనేది ప్రశ్నార్థకమే. అనారోగ్యవంతమైన జీవాల మాంసం తినడంతో ప్రజలు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పశువైద్యులు పరిశీలించిన తర్వాతనే జీవాలను మాంసానికి వినియోగించాలి. అలా జరగడం లేదు. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.– శివనాగిరెడ్డి, అధ్యక్షుడు, రైతుసంఘాల ఐక్యవేదిక, కర్నూలు -
అపరిశుభ్ర మాంసంతో జాగ్రత్త..!
సాక్షి,సిటీబ్యూరో: మటన్ రుచి కోసం అర్రులు చాస్తున్నారా... మటన్‌కర్రీ.. బిర్యానీ.. పత్తర్‌కా ఘోష్ వంటి మటన్ వంటకాలను బాగా ఇష్టపడుతున్నారా.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..అపరిశుభ్ర పరిసరాలతో అలరారుతోన్న మాంసం దుకాణాల్లో మటన్ కొనుగోలు చేస్తే మీకు అనారోగ్యం తథ్యమంటున్నారు వైద్యనిపుణులు. ప్రధానంగా హైదరాబాద్ నగరంతోపాటు దేశరాజధాని ఢిల్లీలో బహిరంగ మార్కెట్లు, మాంసం దుకాణాలు, స్లాటర్‌హౌస్‌లలో విక్రయిస్తున్న మటన్‌లో మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే సూక్ష్మజీవుల ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు జాతీయ మాంసం పరిశోధన కేంద్రం తాజా పరిశోధనలో వెల్లడవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా జూనోటిక్ వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మటన్‌లో 5 నుంచి 8 శాతం ఈ రెండు నగరాల్లో విక్రయిస్తున్న మాంసంలో ఉన్నట్లు తేలడం గమనార్హం. అపరిశుభ్రం మాంసంలో రోగకారకాలు.. ప్రధానంగా బహిరంగ మార్కెట్లలో అపరిశుభ్ర పరిసరాల్లో విక్రయిస్తున్న మాంసంలో బ్రూసిల్లోసిస్, లెప్టోస్పైరోసిస్ వంటి సూక్ష్మజీవుల ఆనవాళ్లున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ఇందులో ఐదు శాతం బ్రూసిల్లోసిస్, మరో 7–8 శాతం లెప్టోస్పైరోసిస్ సూక్ష్మజీవుల ఆనవాళ్లున్నట్లు బయటపడింది. ఈ సూక్ష్మజీవులు మాంసం విక్రయదారులు, వినియోగదారుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపడంతోపాటు పలు జీర్ణకోశవ్యాధులు, జ్వరం తదితర విపరిణామాలకు దారితీస్తున్నట్లు తెలిసింది. ఇటీవల గ్రేటర్‌హైదరాబాద్‌తోపాటు దేశరాజధాని ఢిల్లీలో 150 మంది మాంసం వ్యాపారుల రక్తనమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయం వెలుగు చూసింది. ప్రధానంగా ఎలుకలు, పిల్లులు అ«ధికంగా సంచరించే మాంసం దుకాణాలు, వాటి మలమూత్రాలు విసర్జించే ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో ఈ సూక్ష్మజీవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. మాంసం విక్రయించే వారు చేతికి గ్లౌజులు, వస్త్రాలపై ధరించే ఆప్రాన్లు లేకుండా మాంసాన్ని తాకుతుండడంతో కూడా ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్లు తేలింది. అరకొరగా తనిఖీలు ప్రధానంగా మహానగరం పరిధిలోని మాంసం దుకాణాలపై తనిఖీలు నామమాత్రమవుతున్నాయి. ఫుడ్‌సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ఇండియా నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నవారే అత్యధికంగా ఉన్నారు. ఆరుబయట నేలపైనే, అపరిశుభ్ర పరిస్థితులున్నచోటనే జంతువులను వధించడంతో ఇన్ఫెక్షన్లు మాంసంలోకి ప్రవేశిస్తున్నాయని ఈ పరిశోధనలో తేలింది. అపరిశుభ్ర దుస్తులను ధరిస్తున్న వ్యాపారుల నుంచి కూడా ఇవి వ్యాప్తిచెందుతున్నాయి. చేతివేళ్లకు గాయాలున్నవారు, ఇతర ఇన్‌ఫెక్షన్లున్న వ్యాపారుల నుంచి మాంసంలోకి ఆ తరువాత వినియోగదారులకు ఈ సూక్ష్మజీవులు వ్యాప్తి చెందుతుండడంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 6 బడా స్లాటర్‌హౌస్‌లు, మరో 3354 మాంసం దుకాణాలున్నాయి. ఇందులో ఇప్పటికే అపరిశుభ్ర పరిస్థితులున్నట్లు గుర్తించి 1518 దుకాణాల యజమానులపై ఇటీవల రూ.1.43 లక్షల జరిమానా విధించినట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా దుకాణాల నుంచి 2708 కిలోల మటన్, 10,218 కిలోల బీఫ్‌ను స్వాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదుచేసినట్లు బల్దియా అధికారులు పేర్కొన్నారు. అవగాహనే కీలకం.. మాంసం వ్యాపారులు,వినియోగదారులు ఈవిషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసం విక్రయించే బహిరంగ మార్కెట్లు, స్లాటర్‌హౌస్‌లు, దుకాణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సూక్ష్మజీవరాహిత్యంగా ఉంచాలని...గొర్రెలు, మేకలను పూర్తి పరిశుభ్ర పరిస్థితుల్లోనే వధించాలని సూచిస్తున్నారు. విక్రయించే వ్యాపారులు సైతం చేతికి గ్లౌజులు, ఆప్రాన్లు ధరించాలని..దుకాణాల్లో ఎలుకలు, పిల్లులు ఇతర పెంపుడు జంతువుల సంచారం, వాటి మలమూత్రాధులు లేకుండా చూడాలని స్పష్టం చేస్తున్నారు. ఇక వినియోగదారులు సైతం మాంసాన్ని పూర్తిగా ఉడికించిన తరవాతనే ఆరగించాలని సూచిస్తున్నారు. -
ఇచ్చిందే మాంసం
మెదక్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు విచ్చల విడిగా కొనసాగుతున్నాయి. అనారోగ్యంతో మృత్యువాత పడే స్థితిలో ఉన్న జీవాలను చౌక ధరలకు కొనుగోలు చేసి, వాటిని కోసి విక్రయిస్తున్నారు. మరికొందరు మాంసం వ్యాపారులు గొర్రెలను కోసి మేక పొట్టేలుగా నమ్మించి అంటగడుతున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 50 నుండి 60 వరకు మాంసం దుకాణాలున్నాయి. కిలో మాంసం ధర రూ.400ల వరకు విక్రయిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కటికలు అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. వధశాల లేకపోవడంతో ఇంటి వద్దనే అపరిశుభ్ర వాతావరణంలో వాటిని వధించి మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఆడ గొర్రెల మాంసాన్ని పొట్టేలుగా నమ్మించి అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎలాంటి మాంసం అమ్ముతున్నారో ప్రజలకు తెలియడం లేదు. పశువైద్యాధికారి ధ్రువీకరణ చేశాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను వధశాలలో కోయాలి. కానీ వధశాల లేకపోవడంతో కటికలు తమ ఇష్టమైన ప్రదేశాల్లో మూగజీవాలను కోసి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. వెటర్నరీ అధికారులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్రమైన మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ప్రజారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అనుమతి లేకుండా మేకపోతుల మాసం విక్రయం మెదక్ జిల్లా కేంద్రం కావడంతో మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మాంసం వ్యాపారులు నిబంధనలు పాటించకుండా విక్రయాలు జరుపుతున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం మాంసం విక్రయదారులు తమ ఇష్టానుసారం గొర్రె పోతులు, మేక పోతులను వధించడానికి వీల్లేదు. పశువైద్యులు పరీక్షించాకే వధించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు అలాంటి నిబంధనలు పాటించకుండా అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్న గొర్రెలు, మేకలను కోస్తూ మాంసం విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయంలో వెటర్నరీ, మున్సిపల్ అధికా రులు లంచాలు తీసుకుంటూ నాణ్యతను పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షల మాటే లేదు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సుమారు లక్ష మేర జనాభా ఉండగా ఒక్క వధశాల కూడా లేకపోవడం గమనార్హం. వ్యాపారులు గొర్రెలు, మేకలు తీసుకొచ్చాక, డాక్టర్లు వాటిని పరిశీలించి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ధృవీకరించిన తరువాతే వాటిని వధించాలి. అనంతరం వైద్యులు మరోసారి పరీక్షలు చేసి, క్షుణ్నంగా పరిశీలించి, వాటి మాంసం సురక్షితమైందని ముద్ర వేయాలి. ఆ తరువాతే మాంసాన్ని దుకాణాల్లో పెట్టి విక్రయించాల్సి ఉంది. గ్రామాల్లో నాణ్యమైన ఆరోగ్యవంతమైన మాంసం దొరుకుతుందని ప్రజలు నమ్ముతారు. పండుగలు, శుభకార్యాల సందర్భంగా మాంసం వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. నాణ్యతతోపాటు తూకం వేయడంలోనూ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారు. మార్కెట్లో అమ్మకం చేసే మాంసంపై ఈగలు, దోమలు వాలకుండా దోమ తెరలు వాడాల్సినప్పటికీ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్, వెటర్నరీ అధికారులు స్పందించి మాంసం విక్రయదారులు నిబంధనలు పాటించి, ప్రజల ఆరోగ్యాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులే చూసుకోవాలి మాంసం విక్రయం విషయాలను మున్సిపల్ అధికారులు చూసుకోవాలి. వారే డాక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. మున్సిపాలిటీ అధికారులు వధశాల ఏర్పాటు చేసి అక్కడ మూగజీవాలను పరిశీలించి కోసేందుకు అనుమతులు ఇవ్వాలి. – అశోక్‌కుమార్, జిల్లా వెటర్నరీ అధికారి, మెదక్ పట్టించుకునే దిక్కేది..? అధికారులు ఆరోగ్యమైన గొర్రెలు, మేకలు పరిశీలించకుండానే విక్రయదారులు అనారోగ్యానికి గురైన జీవాలను వధిస్తూ మాంసం విక్రయిస్తూ..ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. విక్రయదారులు తమ ఇష్టానుసారంగా నాణ్యతలను పాటించకుండా మాంసం విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. – విజయ్, మెదక్ వధశాల లేకపోవడంతోనే.. మెదక్ పట్టణంలో మాంసం విక్రయానికి వధశాల లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. మున్సిపాలిటీకి సంబం«ధించి వధశాల ఉంటే అక్కడే ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెటర్నరి డాక్టర్ సర్టిఫై చేసిన తరువాత ఆరోగ్యవంతమైన జీవాలను కోసి అమ్మాల్సి ఉంటుంది. – సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, మెదక్ -
‘జలీల్ ఖాన్ ప్రమేయంతోనే అక్కడ మటన్ షాప్’
సాక్షి, విజయవాడ : వించిపేట్లో జెండా చెట్టును తొలగించి మటన్ షాప్ ఏర్పాటు చేయడంలో టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పవిత్రమైన జెండాలను రోడ్డుపై పడేసి మటన్ షాపు ఏర్పాటు చేశారని విమర్శించారు. షాప్ ఏర్పాటును అడ్డుకున్న వారిపై జలీల్ ఖాన్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. మైనారిటీ ఆస్తులను కాపాడాల్సిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ షాప్ యజమానికి అండగా ఉండటం దారుణమన్నారు. జలీల్ ఖాన్, సలీం, అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వృత్తి మటన్ వ్యాపారం...ప్రవృత్తి దొంగతనాలు
గుడ్లవల్లేరు : గన్నవరంలో మటన్ దుకాణాన్ని నడుపుకునే ఓ యువకుడు తన ప్రవృత్తిని దొంగతనాలుగా ఎంచుకున్నాడు. నేర ప్రవృత్తి గల కొల్లిశెట్టి భీమరాజు అలియాస్ వీర్రాజును శుక్రవారం గుడ్లవల్లేరు పోలీసులు కోర్టుకు అప్పగించారు. నిందితుడిని పట్టుకునేందుకు తన బృందంతో కలిసి రాత్రింబవళ్లు కష్టపడి గుడ్లవల్లేరు ఎస్ఐ పి.విజయ్‌కుమార్ చాకచక్యంగా వ్యవహరించారని పామర్రు సీఐ డి.శివకుమార్ అభినందించారు. గత నెల 22వ తేదీన గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడాలి జ్యోతికి చెందిన రూ.90వేల విలువైన బంగారు ఆభరణాలను నిందితుడు భీమరాజు చోరీ చేశాడు. 2006లో జరిగిన చోరీలో నిందితుడి వేలిముద్రల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టారు. చివరకు గుడ్లవల్లేరు బస్టాండ్‌లో దొంగిలించిన సొత్తుతో సహా పట్టుబడ్డాడు. నిందితుడు గన్నవరంలో ఆదివారం మటన్ దుకాణాన్ని నడుపుతాడు. వారంలో మిగిలిన ఆరు రోజులు చోరీలు చేస్తాడు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 10 పోలీస్స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదయ్యాయి. 2006లో తన సొంత గ్రామం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద దేవరపల్లిలోనే దుకాణంలో సీడీలను దొంగిలించి బాల నేరస్తుడిగా శిక్షను అనుభవించాడు. 2011లో భీమడోలులోని ఒక దుకాణంలో రీచార్జ్ కూపన్లను దొంగిలించాడు. 2014లో కొవ్వూరులో బైక్ దొంగతనాలు చేశాడు. 2017లో పామర్రులో గొర్రెలను, అదే ఏట నూజివీడులో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. ద్వారకా తిరుమలో గ్యాస్ ఏజెన్సీలో చోరీకి పాల్పడ్డాడు. -
మజా చేశారు..
కనుమ.. మాంసాహార ప్రియులకు, మందుబాబులకు పెద్ద పండగ. మకర సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమ నాడు పలువురు మాంసాహారాన్ని విధిగా ఆరగిస్తారు. అలాగే మద్యం అలవాటున్న వారు మిగతా రోజులకంటే కనుమ రోజు ఎక్కువగా సేవిస్తారు. కనుమ పండగ మంగళవారం కావడంతో మాంసాహార, మందుప్రియులు మస్తుగా మజా చేశారు. ఇలా జిల్లా, నగరవ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన మద్యాన్ని గటగటా తాగేశారు. రూ.8 కోట్ల విలువ చేసే నాలుగు లక్షల కిలోల చికెన్, 30 వేల కిలోల మటన్‌లను లాగించేశారు. ఔరా! అనిపించారు. సాక్షి, విశాఖపట్నం: మంగళవారం తెలవారగానే మాంసాహారులు దుకాణాల ముందు క్యూ కట్టారు. కిలోల కొద్దీ చికెన్, మటన్ కొనుగోలు చేశారు. మామూలు రోజుల కంటే దాదాపు రెట్టింపు మాంసాన్ని ఇళ్లకు తీసుకెళ్లారు. వీరి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ దుకాణదారులు పెద్దమొత్తంలో కోళ్లను స్టాకు ఉంచుకున్నారు. జిల్లావ్యాప్తంగా (జిల్లా, నగరం కలిసి) ప్రతి ఆదివారం లక్షన్నర కోళ్ల వినియోగం జరుగుతుంది. ఒక్కో కోడి సగటున రెండు కిలోల బరువుంటుంది. ఈ లెక్కన మూడు లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుంది. అయితే కనుమ పండగ సందర్భంగా కోళ్ల ఫారాల నిర్వాహకులు రెండు లక్షల కోళ్ల (నాలుగు లక్షల కిలోలు)ను సిద్ధం చేశారు. జీవీఎంసీ పరిధిలో దాదాపు 1300 చికెన్ దుకాణాల ద్వారా ఈ కోళ్లన్నీ మంగళవారం మధ్యాహ్నానికే అమ్ముడైపోయాయి. బ్రాయిలర్ చికెన్ కిలో స్కిన్‌తో రూ.150, స్కిన్లెస్ రూ.160 ధరను నిర్ణయించారు. కానీ చాలామంది కిలో స్కిన్‌తో రూ.170, స్కిన్లెస్ను రూ.180కి అడ్డగోలుగా పెంచేసి సొమ్ము చేసుకున్నారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా పత్రికలకు సెలవు కావడంతో మంగళవారం పేపర్లు మార్కెట్లోకి రాలేదు. దీంతో చికెన్ ధరలు వినియోగదార్లకు తెలియకుండా పోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కిలోకు రూ.20లు అదనంగా పెంచి విక్రయించారు. ఇలా సగటున కిలో ధర రూ.150 చొప్పున చూసినా రూ.6 కోట్ల విలువైన చికెన్ అమ్మకాలు జరిపారు. గత ఏడాదికంటే ఈ కనుమ పండగకు చికెన్ అమ్మకాలు పెరిగాయని బ్రాయిలర్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ విశాఖ అధ్యక్షుడు ఆదినారాయణ ‘సాక్షి’కి చెప్పారు. మటన్ అమ్మకాలకూ ఊపు.. మరోవైపు కనుమ పండగకు మటన్ అమ్మకాలు బాగానే జరిగాయి. జిల్లాలోనూ, నగరంలోనూ వెరసి మంగళవారం ఒక్కరోజే 30 వేల కిలోలకు పైగా మేకమాంసం విక్రయించినట్టు అంచనా. కిలో మటన్ రూ.600 ధర నిర్ణయించారు. ఈ లెక్కన దాదాపు రూ.2 కోట్ల విలువైన మేకమాంసం అమ్ముడుపోయింది. నగరంలో దాదాపు 750 మటన్ దుకాణాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో మటన్ కోసం నగర జనం ఎక్కడికక్కడే బారులు తీరుతూ కనిపించారు. గ్లాసులు గలగల.. ఇక కనుమ పండగ రోజున మందుబాబులు ‘మత్తు’గా మజా చేశారు. ఈ రోజు కోసమే వారు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నట్టుగా కనిపించారు. కనుమ పండగను అమ్మకాల జోరును ఊహించిన మద్యం దుకాణదార్లు రెట్టింపు స్టాకును అందుబాటులో ఉంచారు. మందుప్రియులు ఎంజాయ్ చేయడానికి నాలుగైదు రోజుల ముందుగానే లిక్కర్‌ను సిద్ధం చేసుకున్నారు. మరికొంతమంది స్నేహితులను కూడా సమకూర్చుకున్నారు. కొంతమంది ఇళ్లలోనూ, మరికొందరు మద్యం దుకాణాలు, ఇంకొందరు హోటళ్లు, బార్లలోనూ మందులో మునిగితేలారు. పలువురు మధ్యాహ్నానికే మద్యం బాటిళ్లను తెరిచేశారు. అలా రాత్రి వరకూ మద్యసేవనంలోనే ఉన్నారు. విశాఖ జిల్లాలోను, నగరంలోనూ కలిపి 401 మద్యం షాపులు, 124 బార్లు ఉన్నాయి. రోజుకు వీటి ద్వారా సగటున రూ.6 కోట్ల విలువైన మద్యం (లిక్కర్, బీరు) విక్రయాలు జరుగుతాయి. అయితే కనుమ పండగ సందర్భంగా దాదాపు రూ.10 కోట్ల విలువైన మందు అమ్ముడుపోయినట్టు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలో మూడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధి ఉంది. వీటిలో విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోనే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద కనుమ పండగ సందర్భంగా కేవలం మద్యం, మాంసాలకు విశాఖ నగర, జిల్లా వాసులు రూ.18 కోట్ల వరకు వెచ్చించారన్న మాట! -
కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తి రిమాండ్
హైదరాబాద్: సిగరెట్ కోసం జరిగిన గొడవగా నగరంలో కలకలం రేపిన కత్తిదాడిలో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 12వ తేదీనా గౌలిపురాలోని మాతా మద్యం దుకాణంలో సిట్టింగ్ గదిలో మద్యం సేవిస్తున్న సమయంలో సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన పవన్ (40) ఎదురుగా మద్యం సేవిస్తున్న తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన యువకుడిని సిగరేట్ అడిగాడు. ఆ యువకుడు ఇవ్వకపోడంతో ఆగ్రహానికి గురైన పవన్ ఎదురుగా ఉన్న మటన్ దుకాణంలోని కత్తి తీసుకొచ్చి యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.