పోస్టాఫీస్ ఏరియాలో అద్దాల బాక్స్‌లు, కవర్లు పెట్టకుండా విక్రయిస్తున్న మటన్
భద్రాద్రి కొత్తగూడెం.: చాలా మందికి ‘ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆదివారం అయితే తప్పకుండా మాంసం ఉండాల్సిందే. మాంసం విక్రయాలపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారులు నిఘా పెట్టాలి. నాణ్యమైన, పరిశుభ్రమైన మాంసం అమ్ముతున్నారా లేదా అని పరిశీలించాలి. సింగరేణి కార్మిక ప్రాంతమైన కొత్తగూడెంలో ప్రతి ఆదివారం వందల సంఖ్యలో మేకలు, గొర్రెలను కోసి అమ్ముతుంటారు. అయితే రోడ్డు పక్కన ఎలాంటి అద్దాల బాక్స్‌లు, కవర్లు లేకుండా వేలాడదీసిన మటన్‌పై నిత్యం దుమ్ము, దూళి పడుతున్నా.. గుంపులుగా ఈగలు వాలుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది తిన్నవారు రోగాలను ‘కొని’తెచ్చుకుంటున్నారు. అధికారుల నిఘా కొరవడడం వల్లే ఇలా జరుగుతోందని, ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటో జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment