సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని దుకాణాల్లోనూ మటన్ కేజీ రూ.700గా ప్రభుత్వం నిర్ణయించిందని, అంతకుమించి ఎవరైనా అమ్మితే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డా. వకీల్ ఒక ప్రకటనలో తెలిపారు. వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, అందుకు విరుద్ధంగా ఎవరైనా రూ. 700 కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తేదిగువ తెలిపిన అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. కేజీ రూ. 700 అని ప్రజలకు తెలిసేలా దుకాణాల్లో కనబడేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోనున్నట్లు డా.వకీల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment