సిగరెట్ కోసం జరిగిన గొడవగా నగరంలో కలకలం రేపిన కత్తిదాడిలో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సిగరెట్ కోసం జరిగిన గొడవగా నగరంలో కలకలం రేపిన కత్తిదాడిలో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈ నెల 12వ తేదీనా గౌలిపురాలోని మాతా మద్యం దుకాణంలో సిట్టింగ్ గదిలో మద్యం సేవిస్తున్న సమయంలో సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన పవన్ (40) ఎదురుగా మద్యం సేవిస్తున్న తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన యువకుడిని సిగరేట్ అడిగాడు.
ఆ యువకుడు ఇవ్వకపోడంతో ఆగ్రహానికి గురైన పవన్ ఎదురుగా ఉన్న మటన్ దుకాణంలోని కత్తి తీసుకొచ్చి యువకుడిపై దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.