
బహదూర్‌పురా: ప్రమాదవశాత్తు మటన్ షాపులో ఉన్న కత్తి తగిలి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి తన ఇంటి వద్ద మటన్ షాపును నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 26వ తేదీన మహ్మద్ ఖురేషి కుమారుడు రియాజ్ ఖురేషి (13) మటన్ షాపులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కత్తి కాలుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం అయింది. బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించగా... రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో తండ్రి మహ్మద్ ఖురేషి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
( చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! )
Comments
Please login to add a commentAdd a comment